
| Movie Name | Dance Master (1986) |
|---|---|
| Director | K Balachander |
| Star Cast | Kamal Haasan, Revathi |
| Music | Ilayaraja |
| Singer(s) | KS Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం
ఏమి మాయ దాహం
మహా సుఖం తడి స్వరం
ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం
జ్వలించెలే నరం నరం
నింగే నీలాలు జల్లే
కన్నె ప్రేమలో ప్రేమ యాత్రలో
వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా
వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
నింగి నా ముంగిలై… నీటి తోరణాలతో, హోయ్
వంగి నా పొంగులే… ఊగే చుంబనాలతో
కన్ను కన్ను కవ్వింతలో… తడి పొడి తుళ్ళింతలో
కసి కసి రెట్టింతలో… అది ఇది అంతింతలో
సయ్యాటాడే ఒయ్యారాలేమో
లేత లేతగా చేతికందగా
జాజి తీగలే నీటి వీణలై
మీటుకున్న పాట చినుకులేరి చీర కట్టగా
వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం… ఏమి మాయ దాహం
మహా సుఖం తడి స్వరం… ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం… జ్వలించెలే నరం నరం
నింగే నీలాలు జల్లే
కన్నె ప్రేమలో ప్రేమ యాత్రలో
వాన జల్లుగ పూలు రాలిన… మాలి లేడు
వాన పూలు ఏరి మాలలల్లగా
వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం… ఏమి మాయ దాహం
Vana Megham song is from the Dance Master movie.
Vana Megham song was sung by KS Chitra.
Vana Megham song lyrics were written by Veturi Sundararama Murthy.
Vana Megham song music was composed by Ilayaraja.