
| Movie Name | Father's Day Special |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Hymath |
| Lyricist | Veeru Gaddam |
| Music Label | Aditya Music |
ఉసురు పోసావు నాన్న… మురిసి పోయావు నాన్న
నడత నేర్పావు నాన్న… భవిత మార్చావు నాన్న
వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న
పైకి కోపాన ఉన్న మనసు మురిపాల వెన్న
విరిసే చిరునవ్వు మాటు… కురిసె కన్నీటి వానా…
బాధలెన్నున్నా బంధాల మరవని బాధ్యత నువ్వు నాన్న…
నువు లేని ఈలోకం… రవి లేని ఆకాశం
ఎదురయ్యే ప్రతి నిమిషం… ఎద కోసే యమపాశం
నీ ప్రేమే మరువనిది… నీ త్యాగం చెరగనిది
నీతోడు లేని చోట… ఎలా నేను బ్రతికేది
ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా…
ఆ భారం మోసిన గుండె నీదే కదా నాన్నా…
అమ్మ పేగు తెంచుకొని… పడ్డ భూమి పైన
చెమ్మగిల్లే ఆ కన్నులు ఆనందపరవశానా…
గోరు ముద్ద తినిపించింది అమ్మ చెయ్యి అయినా…
మెతుకులు ఉడికించింది నీ చెమటలోనా…
పస్తులు నువ్వుంటావు… ఆస్తులు మాకంటావు
ఆపదొస్తే ప్రాణమైన అడ్డు వేస్తనంటావు…
కథలెన్నో చెప్తావు… రథమయ్యి మోస్తావు
విధినైనా ఎదురించే ధైర్యం మాకిస్తావు…
అందమైన నా కల ఆకాశమైనా… అందించే మొక్కలా నువ్వు మొలిచావు నాన్నా
చెట్టులాగా నిలుపగా నన్ను భూమి పైనా
పాతాళమంత దిగే వేరు నువ్వు నాన్నా…
పెదవే కదలనీ పేరు నీది అయినా… కాటికెళ్లే దాకా తపన పడతావు
పూల అందాల మోస్తూ వాలే తావే నువ్వు నాన్నా
కాంతి పుంజాల నిస్తు కరిగే… చమురు నువ్వు నాన్న
Usuru Posavu Nanna song is from the Father's Day Special movie.
Usuru Posavu Nanna song was sung by Hymath.
Usuru Posavu Nanna song lyrics were written by Veeru Gaddam.