
| Movie Name | Arya 2 (2009) |
|---|---|
| Director | Sukumar |
| Star Cast | Allu Arjun, Kajal Agarwal, Nava Deep |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | KK |
| Lyricist | Balaji |
| Music Label | SonyMusicSouthVEVO |
ఉప్పెనంత ఈ ప్రేమకి… గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకి… ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దూరనికే… విరహం ఎందుకో
ఓ..! నిన్ను చూసే ఈ కళ్ళకి… లోకమంతా ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకి… ఇన్ని శిక్షలు ఎందుకో..??
ఐ లవ్ యూ… నా ఊపిరి ఆగిపొయినా
ఐ లవ్ యూ… నా ప్రాణం పొయినా
ఐ లవ్ యూ… నా ఊపిరి ఆగిపొయినా
ఐ లవ్ యూ… నా ప్రాణం పొయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి… గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి… భాషే ఎందుకో…??
కనులలోకోస్తావు… కళలు నరికేస్తావు
సెకనుకోసరైన చంపేస్తావు..!!
మంచులా ఉంటావు… మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావు…
తీసుకుంటే నువ్వు ఊపిరి… పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకోకు ముల్లులా మరి గుండెల్లో సరాసరి..!!
ఐ లవ్ యూ… నా ఊపిరి ఆగిపొయినా
ఐ లవ్ యూ… నా ప్రాణం పొయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి… గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో..??
చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే…
మబ్బులే పోగేసి… కాల్చేయనా..??
చిలకలే నీ పలుకు… తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతేయనా…??
నిన్ను కోరి పూలు తాకితే… నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే… తోడేస్తా ఆ కళ్ళనే..!!
ఐ లవ్ యూ… నా ఊపిరి ఆగిపొయినా
ఐ లవ్ యూ… నా ప్రాణం పొయినా
ఐ లవ్ యూ… నా ఊపిరి ఆగిపొయినా
ఐ లవ్ యూ… నా ప్రాణం పొయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి… గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి… భాషే ఎందుకో..??
Uppenantha Ee Prema Ki song is from the Arya 2 movie.
Uppenantha Ee Prema Ki song was sung by KK.
Uppenantha Ee Prema Ki song lyrics were written by Balaji.
Uppenantha Ee Prema Ki song music was composed by Devi Sri Prasad.