
| Movie Name | Saripodhaa Sanivaaram |
|---|---|
| Director | Vivek Athreya |
| Star Cast | Nani, Priyanka Arul Mohan |
| Music | Jakes Bejoy |
| Singer(s) | Sanjith Hegde, Krishna Lasya Muthyala |
| Lyricist | Sanare |
| Music Label |
అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా… గుండెల్లో ఏదో వాలే, వాలే
వేషాలే మార్చే నాలో ఆవేశాలే
కోపాలే కూల్చే నీతో సల్లాపాలే
నీ… మైకంలో ప్రాణం తేలే, తేలే
ఏమిటో తెలియదెందుకో
మనసు నిన్నలా నేడు లెేదే
కారణం తెలుసుకోవడానికని
పిలిచినా పలకదే..!
ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో…!
మౌనాలే మన ఊసులలో
మాటలే తప్పిపోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఎటుకో…!
అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా… గుండెల్లో ఏదో వాలే, వాలే
కల్లోలం కమ్మేసే… అంతా నీ వలనే
కళ్లారా నువ్వే నవ్వినా క్షణమునే
నా కనులకే కొత్త వెలుగులే చేరి
కలతలే చెయ్యి విడిచెలే
హే, కలకే వేల తళుకులే
నువ్వు కనబడే దాక కలలే
ఇరువురి చేతిలోని రేఖలన్నీ
ముడిపడే… రాత… బలపడే
విడివిడి దారులేమో
వీడిపోని జంటై కదిలే… ఆ ఆ
ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
…మనకే మనమే ఎవరో…
ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో
మౌనాలే మన ఊసులలో
మాటలే తప్పిపోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఎటుకో…! ఓ ఓ ఓ
(ఉల్లాసం ఉరికే ఎదలో
మనకే మనమే ఎవరో…)
Watch ఉల్లాసం ఉరికే ఎదలో Lyrical Video
Ullaasam Urike song is from the Saripodhaa Sanivaaram movie.
Ullaasam Urike song was sung by Sanjith Hegde, Krishna Lasya Muthyala.
Ullaasam Urike song lyrics were written by Sanare.
Ullaasam Urike song music was composed by Jakes Bejoy.