
| Movie Name | Indira |
|---|---|
| Director | Suhasini Maniratnam |
| Star Cast | Arvind Swamy, Anu Hasan |
| Music | AR Rahman |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Lahari Telugu | T-Series |
తొలి తొలి బిడియాల పువ్వా… త్వరపడి పరుగేలా
తొలి తొలి బిడియాల పువ్వా… త్వరపడి పరుగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవశాన పసి పరువానా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై
పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పువ్వా
త్వరపడి పరుగేలా
చిన్నదాని వయసే… చెంత చేర పిలిచే
తాకితే తడబడుతూ జారేందుకా
నిలవని అలలా… నిలువున అల్లితే
మృదువైన పూల ప్రాయం ఝల్లుమనదా
ఆశల తీరాన మోజులు తీర్చెయ్ నా
హద్దు మరి తెంచేస్తే… యవ్వనం ఆగేనా
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
నరముల వీణ మీటే తరుణమిదే
తొలి తొలి బిడియానా పువ్వే సొగసుగ నలిగేలా
మధువులు కురిసే… పెదవుల కొరకే
ఇరవై వసంతాలు వేచి ఉన్నా
మదిలోని అమృతం పంచడానికేగా
పదహారు వసంతాలు దాచుకున్నా
ఇకపైన మన జంట… కలనైన విడరాదే
మరీ కొంటె కల వెంట… కన్నె ఎద తేలరాదే
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా
Tholi Tholi Bidiyala song is from the Indira movie.
Tholi Tholi Bidiyala song was sung by S P Balasubramanyam, Chitra.
Tholi Tholi Bidiyala song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Tholi Tholi Bidiyala song music was composed by AR Rahman.