
| Movie Name | Rajendra Prasad |
|---|---|
| Director | Venkatesh Pediredla |
| Star Cast | Dr. Rajendra Prasad, Narasimharaju, Prema, Tulasi |
| Music | S Siva Dinavahi |
| Singer(s) | Harini Ivaturi |
| Lyricist | Madhukiran Maddikunta |
| Music Label | Aditya Music |
The Soul Of Anukoni Prayanam Lyrics in Telugu
ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసే ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా
రెప్పలే మోయలేని
జ్ఞాపకాల బరువే పెరిగి
చెంపపై జారిపోయే చెలిమే
చుట్టు చుట్టాలు లేకున్నా
నాకంటూ లోకాన ఏకైక చిరునామా నువ్వే కదా
ఓహో పాలల్లో నీళ్ళల్లే కలిసేగా ఉండేది
బాధైనా నవ్వైనా స్నేహమే
ఓ హో ఓ ఓ ఓ ఓ
అనుకోని ప్రయాణమే
ఓ ఓ ఓ, అనుకోని ప్రయాణమే
అనుకోని ప్రయాణమే
అనుకోని ప్రయాణమే
ఏ మనిషో నీ కొరకు
సాయంగా లేకుండా
చేరావో ఇందాక ఒంటరిగా
నువ్వంటూ నేనంటూ
విడివిడిగా ఉండుంటే
నీ నవ్వు నీ బాధకు విలువే ఉందా
మధ్యలో ఆగిపోతే
ఆశయాల నడకే అలిసి
ఎన్నడూ చేరలేము దరికి
ఏది మంచైనా చెడ్డైనా
నీకంటూ ఓ తోడు ఉంటుంది
మనసార గమించితే
చూడు వారైనా వీరైనా
విడిగానే పోతున్న వాళ్లంతా
చేరేటి తీరమొక్కటే
ప్రతిపూట జీవితాన
అనుకోని ప్రయాణమే
ఎటు చేర్చుతుందో ఏమో
అనుకోని ప్రయాణమే
(అనుకోని ప్రయాణమే)
(అనుకోని ప్రయాణమే)
The Soul Of Anukoni Prayanam song is from the Rajendra Prasad movie.
The Soul Of Anukoni Prayanam song was sung by Harini Ivaturi.
The Soul Of Anukoni Prayanam song lyrics were written by Madhukiran Maddikunta.
The Soul Of Anukoni Prayanam song music was composed by S Siva Dinavahi.