
| Movie Name | Karthik, Naga Chaitanya |
|---|---|
| Director | Vikram K Kumar |
| Star Cast | Naga Chaitanya, Raashi Khanna, Malavika Nair, Avika Gor |
| Music | Thaman S |
| Singer(s) | Karthik |
| Lyricist | Vanamali |
| Music Label |
కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్ యూ
నువు చేసినా త్యాగముకు
మనసును నిలువున తడిపే
జ్ఞాపకములకు అన్నిటికీ థ్యాంక్ యూ
ఏ ఋణమే చోటా మిగిలిపోయిందో… థ్యాంక్ యూ
ఆ దరికే చేరి చెబుతున్నా… థ్యాంక్ యూ
(థ్యాంక్ యూ)
వెలుతురులో నను కమ్మిన చీకటి కడిగి
లోకము చూపిన కన్నులకూ
సాయం చేసిన చేతుల విలువను తెలిపే
మమతలకే థ్యాంక్ యూ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్ యూ
(థ్యాంక్ యూ… థ్యాంక్ యూ)
ఎపుడో వేరైనా నీలోనే నన్ను దాచినావా, నేస్తం
గతమే చేదైన చిరునవ్వుతో చేరువయ్యినావా, నేస్తం
కలవని దారులు ఒకటౌతాయని తెలిపి
నీ జతలోనే నను నిలిపి
నీకిక మేమున్నామనే నిండుగ పలికే
ఓ నేస్తం… థ్యాంక్ యూ
తమ చెయ్యందించి
నను గమ్యం చేర్చే (థ్యాంక్ యూ)
ప్రతి మనసుకు నేడు చెబుతున్న
థ్యాంక్ యూ (థ్యాంక్ యూ)
నను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి
నడకలు నేర్పిన దారులకీ
నా కన్నీటిని తుడిచిన నీ చేతులకి
అందరికీ… థ్యాంక్ యూ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
Thank You Title song is from the Karthik, Naga Chaitanya movie.
Thank You Title song was sung by Karthik.
Thank You Title song lyrics were written by Vanamali.
Thank You Title song music was composed by Thaman S.