Movie Name | Folk song - 8 (2025) |
---|---|
Director | |
Star Cast | surender |
Music | Bharath Kumar Mekala |
Singer(s) | Patamma Rambabu, Jupaka Siva & Others |
Lyricist | Mittapalli Surender |
Music Label | Mittapalli Studio |
తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాల
(తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాల)
నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు
నెత్తురోసుకున్న నేలా
తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా
తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో
దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు
(దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు)
ఉయ్యాలలూపావు జంపాలలూపావు
ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు
(ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు)
ఎండిన ఆకుల ఎన్నుపూసల నుండి
ఆయుధాలు దీసి పోరాడమన్నావు
తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా
పడమటి కొండల్లో వాలేటి పొద్దును
వేలెత్తి చూపావు ఉదయించమన్నావు
(వేలెత్తి చూపావు ఉదయించమన్నావు)
అన్యాయమన్నది ఎదిరించమన్నావు
న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు
(న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు)
దీనుల కళ్ళల్లో పేదోల్ల ఇళ్లల్ల
దీపాలు మీరైనా సాలు బిడ్డన్నావు
తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా
పచ్చని పైరుల్లో వెచ్చాని నెత్తురు
చిల్లినా నీ కంట్లో కన్నీరు దాచావు
(చిల్లినా నీ కంట్లో కన్నీరు దాచావు)
తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి
పోరులో త్యాగాలు తొలి మెట్టు అన్నావు
(పోరులో త్యాగాలు తొలి మెట్టు అన్నావు)
తెలుసుకోమన్నావు తలుసుకోమన్నావు
పేదోల్ల రాజ్యాన్ని సాధించమన్నావు
తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా
దేశాన్ని కాపాడే సైనిక బిడ్డలా
బతుకుదెరువు లేక బాడరుకు పంపావు
(బతుకుదెరువు లేక బాడరుకు పంపావు)
అరచేత పెంచావు ఆయుధాన్నిచ్ఛావు
సరిహద్దు సేవల్లో సాగిపొమ్మన్నావు
(సరిహద్దు సేవల్లో సాగిపొమ్మన్నావు)
శత్రువులకేనాడు తలవంచకన్నావు
కన్నందుకు తలవంపు తేకన్నావు
తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా
యే గూనాన గూనానరే
గూననారే గూనాన గూనానరే
గూనాన గూనానరే
గూననారే గూనాన గూనానరే
త్యాగాల కాగితం మన నేల సంతకం
నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు
(నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు)
ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు
రాజకీయాలను కూలదొయ్ మన్నావు
(రాజకీయాలను కూలదొయ్ మన్నావు)
ఎర్రజెండానెత్తి దొరల గుండెపైన
దండుగా దండిగా దాడి చేయమన్నావు
తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా
నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు
నెత్తురోసుకున్న నేలా
తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా
ఓ గూనాన గూనానరే
గూననారే గూనాన గూనానరే
తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా