Tellarindi Legando Song Lyrics - Kallu

Tellarindi Legando Song Lyrics - Kallu
Tellarindi Legando Song Lyrics: Tellarindi Legando is a Telugu song from the film Kallu starring Sivajiraja, Rajeshwari, directed by MV Raghu. "Tellarindi Legando" song was composed by SP Balu and sung by Sirivennela Seetharama Sastry. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Tellarindi Legando Song Details

Movie NameKallu (1988)
DirectorMV Raghu
Star CastSivajiraja, Rajeshwari
MusicSP Balu
Singer(s)Sirivennela Seetharama Sastry
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Tellarindi Legando Song Lyrics in Telugu

Tellarindi Legando Lyrics in Telugu

తెల్లారింది లెగండో, ఓ ఓ… కొక్కోరోకో, ఓ ఓ
తెల్లారింది లెగండో కొక్కోరోకో
మంచాలింక దిగండో కొక్కోరోకో
తెల్లారింది లెగండో… కొక్కోరోకో
మంచాలింక దిగండో… కొక్కోరోకో

పాములాటి సీకటి పడగ దించి పోయింది
భయం లేదు భయం లేదు
నిదర ముసుకు తీయండి

చావులాటి రాతిరి
చూరు దాటి పోయింది
భయం లేదు భయం లేదు
సాపలు సుట్టేయండి

ముడుసుకున్న రెక్కలిరిసి
పిట్ట సెట్టు ఇడిసింది
ముడుసుకున్న రెక్కలిర్చి
పిట్ట చెట్టు విడిచింది
మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనియ్యండి

తెల్లారింది లెగండో… కొక్కోరోకో
మంచాలింక దిగండో… కొక్కోరోకో

చురుకు తగ్గిపోయింది చందురుడి కంటికి
చులకనై పోయింది లోకం చీకటికి
కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం
ఎనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం

మసకబారి పోయిందా… సూసే కన్నూ
ముసురుకోదా మైకం… మన్ను మిన్ను
కాలం కట్టిన గంతలు తీసి
కాంతుల ఎల్లువ గంతులు ఏసి

తెల్లారింది లెగండో… కొక్కోరోకో
మంచాలింక దిగండో… కొక్కోరోకో

ఎక్కిరించు రేయిని సూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుపెట్టి ఇసిరిందా… సూరీడి సూపులబాణం
కాలి బూడిదైపోదా… కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుందా… సిక్కని పాపాల చీడ

చెమటబొట్టు చమురుగా… సూరిడ్ని వెలిగిద్దాం
వెలుగుచెట్టు కొమ్మల్లో… అగ్గిపూలు పూయిద్దాం
ఏకువ శక్తుల కత్తులు దూసి
రేతిరి మత్తును ముక్కలు సేసి

తెల్లారింది లెగండో, ఓ… కొక్కోరోకో, ఓ
మంచాలింక దిగండో, ఓ… కొక్కోరోకో

FAQs & TRIVIA

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kallu Movie

  1. Tellarindi Legando Song Lyrics

Tellarindi Legando Song FAQ

What movie is Tellarindi Legando song from?

Tellarindi Legando song is from the Kallu movie.

Who sang Tellarindi Legando song?

Tellarindi Legando song was sung by Sirivennela Seetharama Sastry.

Who wrote Tellarindi Legando song lyrics?

Tellarindi Legando song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Tellarindi Legando song?

Tellarindi Legando song music was composed by SP Balu.