Movie Name | Ramam Raghavam (2025) |
---|---|
Director | Dhanraj Koranani |
Star Cast | Samuthirakani, Dhanraj Koranani |
Music | Arun Chiluveru |
Singer(s) | Sreekanth Hariharan |
Lyricist | Ramajogayya Sastry |
Music Label | Mango Music |
తెలిసిందా నేడూ… గమనించి చూడూ
నిను కన్న తోడూ… విలువేంటనీ
నిశి నీడలోనూ… నిను వీడిపోనీ
ఒక నాన్న మనసూ… బరువెంతనీ
పొరపాటునా… చేజారకూ
పొరపాటున చేజారకు
మరి దొరకని… ఆ ఉనికిని
వేధించకు, బాధించకు
నిను పెంచిన ఆ ప్రేమని
తెలిసిందా నేడూ… గమనించి చూడూ
నిను కన్న తోడూ… విలువేంటనీ
విలువేంటనీ…
ఏది నీ నిధి? ఏది కానిది, తేల్చుకోలేవా
పెడదారిగా విధి
నడుపుతున్నది పోల్చుకోలేవా??
ఏది నిజమగు రాబడి
ఏమిటో నీ అలజడి
చిటికెలో సుడి తిరిగిన
చెడు తలపులే… నిను తరిమిన
మరు క్షణములో పల కలిగిన
పరితాపమే ఎద నలుపు కడిగిన
మార్పుగా… తొలి తూర్పుగా
ఆ నిన్నటిని, చీకటిని వదిలి పదవా
తెలిసిందా నేడూ… గమనించి చూడూ
నిను కన్న తోడూ… విలువేంటనీ
నిశి నీడలోనూ… నిను వీడిపోనీ
ఒక నాన్న మనసూ… బరువెంతనీ
పొరపాటునా… చేజారకూ
పొరపాటున చేజారకు
మరి దొరకని… ఆ ఉనికిని
వేధించకు, బాధించకు
నిను పెంచిన ఆ ప్రేమని
తెలిసిందా నేడూ… గమనించి చూడూ
నిను కన్న తోడూ… విలువేంటనీ
విలువేంటనీ… విలువేంటనీ