
| Movie Name | Prof. Pulikond |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Dr. B. Radha |
| Singer(s) | Kalpana, Harini, Sai Charan, Krishna Chaitanya |
| Lyricist | Prof. Pulikonda Subbachary |
| Music Label |
వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ
వరదాయని సుమధారిణి వఱలు కల్పవల్లీ…
వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ
శృంఖలాలు ఛేదించిన శూర ధీర నీవమ్మా
పంటసిరుల పొంగించే బతుకమ్మవు నీవమ్మా
కృష్ణమ్మను కొంగువేసి గోదావరి నడికట్టుగ
మంజీరగ మానేరుగ మమ్ము గాచు మా తల్లీ
వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ…
శాతవాహన రాజ్య సిరిపొలము నీ చీర
కాకతీయ వైభవమది ఘనమైన మకుటమ్ము
అమరవీరల రుధిరమె అలరారే పారాణి
ఆది తెలుగుల చరిత అవతారమె నీవూ
వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ…
సోమనాథుని జానుతెనుగు తేనెల జాలు
పోతన్న భాగవత పూదేనె మధురిమలు
మల్లినాథయ వ్యాఖ్య యశోభూషణ యశము
కావ్యాలు శాస్త్రాలు కళలు విరిసిన గడ్డ
వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ…
యాదాద్రి నరసన్న ఏడుపాయల దుర్గ
భద్రాద్రీ రామయ్య బాసరలో చదువులమ్మ
కొండగట్టు అంజన్న కొరివిలోన వీరభద్ర
కోరి కొలుచు దేవుళ్ళు కొలువుందురు నీలోనే
వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ…
రామప్ప ఉలి కళలు రాగ రాగిణి చెలువు
వేయి స్తంభాల గుడి ఏకశిల నగర సిరి
చార్మినారు భాగ్యలక్ష్మి చేయిచేయి కలుపు నేల
బౌద్ధజైనఇస్లాములు పరిఢవిల్లిన నేల
శిల్పకళ వాస్తు కళ చెలవొందిన దీనేల
వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ…
ఆ చరిత, ఆ ఘనత, ఆ స్ఫూర్తి, ఆ కీర్తి
ఆ కళల అనురక్తి… ఆ అక్షర ఘనశక్తి
ఆ పంట సిరులన్ని అమరి చెలువొందగా
పాలు పొంగిన రీతి మమ్ముల నడుపవె తల్లి
వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ…
Read Also: Telangana Swag Lyrics by Parnika Manya
Telangana Thalli Prayer song is from the Prof. Pulikond movie.
Telangana Thalli Prayer song was sung by Kalpana, Harini, Sai Charan, Krishna Chaitanya.
Telangana Thalli Prayer song lyrics were written by Prof. Pulikonda Subbachary.
Telangana Thalli Prayer song music was composed by Dr. B. Radha.