
| Movie Name | Sytv, Thirupathi Matla |
|---|---|
| Director | Thirupathi Matla |
| Star Cast | Yamini |
| Music | Thirupathi Matla |
| Singer(s) | Bhargavi Matla |
| Lyricist | Thirupathi Matla |
| Music Label | Sy TV |
మేడాలొద్దు మిద్దేలొద్దు
లారీలొద్దు కారులొద్దు
ఆయ్ పాయ్ సోకులొద్దు
అయినంగా ఉండుడొద్దూ
సింతాకు పుస్తె కడితే ఓ దొరో
తాటాకుల గుడిసెలుంట నా దొర
సింతాకు పుస్తె కడితే ఓ దొరో
తాటాకుల గుడిసెలుంట నా దొర
కమ్మాలొద్దు బుట్టాలొద్దు
కాటుక డబ్బీలొద్దు
పాపిడ బిల్లాలొద్దు
పక్కా బుల్లాలు వద్దూ
నువ్ సల్లంగా ఉంటె సాలు ఓ దొరో
సైరకు సై అంటే సాలు నా దొరా
సల్లంగా ఉంటె సాలు ఓ దొరో
సైరకు సై అంటే సాలు నా దొరా
రంగూ రంగు సీరాలొద్దు
రానూపోనూ ఖర్సులొద్దు
రాజా భోగాలు వద్దు
రాణి వాసాలు వద్దూ
నీ సిటికనేలు సోపతైతే ఓ దొరో
సచ్చెదాక సాదుకుంట నా దొర
సిటికనేలు సోపతైతే ఓ దొరో
సచ్చెదాక సాదుకుంట నా దొరా
పట్టూ పాన్పులు వద్దు
పట్టే మంచాలు వద్దు
తీరు తీరు రుసులు వద్దు
తీరని కోరికలు వద్దూ
కలోగంజో కలిసి తింట… ఓ దొరో
కలకాలం కలిసి ఉంట నా దొరా
కలోగంజో కలిసి తింట… ఓ దొరో
కలకాలం కలిసి ఉంట నా దొరా
నాటు సరసాలు వద్దు
మోటూ మురిపాలు వద్దు
నగలు నాణాలు వద్దు
నలుగుట్ల నవ్వుడొద్దూ
నువు ముట్టుకుంటే సాలున్నయ్య ఓ దొర
సెయ్ పట్టుకుంటే సాలునయ్య నా దొర
ముట్టుకుంటే సాలున్నయ్య ఓ దొర
సెయ్ పట్టుకుంటే సాలునయ్య నా దొరా
ముద్దూ ముచ్చటలు వద్దు
మూగసైగలు వద్దు
కొసరి కొసరి పిలుసుడొద్దు
కొంటే మాటలు వద్దూ
నీ మట్టి మనసు నాకిస్తే ఓ దొరో
గుండెల్లోవెట్టి సూసుకుంట నా దొర
మట్టి మనసు నాకిస్తే ఓ దొర
గుండెల్లోవెట్టి సూసుకుంట నా దొరా
Telangana Folk song is from the Sytv, Thirupathi Matla movie.
Telangana Folk song was sung by Bhargavi Matla.
Telangana Folk song lyrics were written by Thirupathi Matla.
Telangana Folk song music was composed by Thirupathi Matla.