
| Movie Name | Aradhana (1987) |
|---|---|
| Director | Bharathiraja |
| Star Cast | Chiranjeevi, Suhasini, Radhika, Rajasekhar |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam & S Janaki |
| Lyricist | Acharya Athreya |
| Music Label | Aditya Music |
తీగనై మల్లెలు… పూచిన వేళ
ఆగనా అల్లనా… పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
తెలిసీ తెలియందా… ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా… అది ఇపుడే తెలిసిందా
ఆశ పడ్డా అందుతుందా… అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా… పొత్తు కుదిరేదా
ప్రేమకన్నా పాశముందా… పెంచుకుంటే దోషముందా
తెంచుంకుంటే తీరుతుందా… పంచుకుంటే మరిచేదా
కలలో మెదిలిందా… ఇది కధలో చదివిందా
మెరుపై మెరిసిందా… అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా… తప్పు నీదవునా
మారమంటే మారుతుందా మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా… చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా… చేయి చేయి కలిసేనా
తీగనై మల్లెలు… పూచిన వేళ
ఆగనా అల్లనా… పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
Teeganai Mallelu song is from the Aradhana movie.
Teeganai Mallelu song was sung by S P Balasubramanyam & S Janaki.
Teeganai Mallelu song lyrics were written by Acharya Athreya.
Teeganai Mallelu song music was composed by Ilayaraja.