
| Movie Name | (1972) |
|---|---|
| Director | Lakshmi Deepak |
| Star Cast | Krishna, Shubha, Halam |
| Music | SP Kodandapani |
| Singer(s) | S P Balasubramanyam, P Susheela |
| Lyricist | Krishnamacharyulu Dasarathi |
| Music Label | Saregama Telugu |
లాలాలా లాలలలల లా లలలా
ఆహా ఆ ఆఆ హ్మ్ మ్
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
తనివి తీరలేదే… నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
చెలియా ఓ… ఓ చెలియా ఆ ఆఆ
ఎన్నో వసంతవేళలలో
వలపుల ఊయలలూగామే
ఎన్నో వసంతవేళలలో
వలపుల ఊయలలూగామే
ఎన్నో పున్నమి రాత్రులలో
వెన్నెల జలకాలాడామే
అందని అందాలా… అంచుకే చేరిననూ
అందని అందాలా… అంచుకే చేరిననూ
విరిసిన పరువాలా… లోతులే చూసిననూ
తనివి తీరలేదే… ఆ ఆఅ ఆఅ
నా మనసు నిండలేదే… ఆఆ ఆఆ
ఏనాటి బంధమీ అనురాగం
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
ప్రియతమా ఓ ప్రియతమా ఆ ఆ
ఎప్పుడు నీవే నాతో ఉంటే
ఎన్ని వసంతాలైతేనేమి
ఎప్పుడు నీవే నాతో ఉంటే
ఎన్ని వసంతాలైతేనేమి
కన్నుల నీవే కనబడుతుంటే
ఎన్ని పున్నమలు వస్తేనేమి
వెచ్చని కౌగిలిలో… హాయిగా కరిగించిననూ
వెచ్చని కౌగిలిలో… హాయిగా కరిగించిననూ
తియ్యని హృదయంలో… తేనెలే కురిపించిననూ
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం, మ్ మ్ మ్
Tanivi Teeralede song is from the movie.
Tanivi Teeralede song was sung by S P Balasubramanyam, P Susheela.
Tanivi Teeralede song lyrics were written by Krishnamacharyulu Dasarathi.
Tanivi Teeralede song music was composed by SP Kodandapani.