
| Movie Name | Aakhari Poratam (1988) |
|---|---|
| Director | K.Raghavendra Rao |
| Star Cast | Nagarjuna, Sridevi, Suhasini |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam & S Janaki |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
స్వాతి చినుకు సందె వేళలో, హోయ్
లేలేత వణుకు అందగత్తెలో, హోయ్
మబ్బే కన్ను గీటే… అరె, మతే పైట దాటే
చలే కొరుకుతుంటే, హోయ్… చెలే ఒదుగుతుంటే
భలేగుంది పడుచు ముచ్చట
భలే కదా గాలి ఇచ్చట
అరె, భలేగుంది పడుచు ముచ్చట
భలే కదా గాలి ఇచ్చట
స్వాతి చినుకు సందె వేళలో, హోయ్
లేలేత వలపు అందగాడిలో, హోయ్
ఈడే ఉరుముతుంటే… నీడే తరుముతుంటే
సరాగాలతోటే స్వరాలల్లుకుంటే
పద అంది పడుచు పూపొదా, హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా
పద అంది పడుచు పూపొదా, హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా
ఈ గాలితో ఒకే చలి
ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమతో ఒకే గిలి
ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక
నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడీ పదాలెన్నో పాడా
వరాలిచ్చిపోరా వరించానులేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు
సాగిన వేళ కురిసిన
స్వాతి చినుకు సందె వేళలో, హో
లేలేత వణుకు అందగత్తెలో, హో
మబ్బే కన్ను గీటే… అరె, మతే పైట దాటే
సరాగాలతోటే స్వరాలల్లుకుంటే
పద అంది పడుచు పూపొదా, హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా
భలేగుంది పడుచు ముచ్చట, హోయ్
భలే కదా గాలి ఇచ్చటా
ఈ వానల కధేమిటో… నా ఒంటిలో సొదెందుకో
నీ కంటిలో కసేమిటో… నా కంటిని తడెందుకో
తొలి వానల గిలిగింతలో… పెనవేసిన కవ్వింతలో
ఎదే మాట రాక… పెదాలందు ఆడ
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళ మెరిసిన
స్వాతి చినుకు సందె వేళలో, హోయ్
లేలేత వణుకు అందగత్తెలో, హోయ్
ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే
చలే కొరుకుతుంటే చెలే ఒదుగుతుంటే
భలేగుంది పడుచు ముచ్చట
భలే కదా గాలి ఇచ్చట
పద అంది పడుచు పూపొదా, హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా
Swathi Chinuku Sande Velalo song is from the Aakhari Poratam movie.
Swathi Chinuku Sande Velalo song was sung by S P Balasubramanyam & S Janaki.
Swathi Chinuku Sande Velalo song lyrics were written by Veturi Sundararama Murthy.
Swathi Chinuku Sande Velalo song music was composed by Ilayaraja.