
| Movie Name | Sarigamalu |
|---|---|
| Director | T. Kranthi Kumar |
| Star Cast | Vineeth, Rambha |
| Music | Ravi |
| Singer(s) | K J Yesudas, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
ప్రవాహమే… గంగా ప్రవాహమే
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా
గాన సరసీరుహ మాలికా…
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా
గాన సరసీరుహ మాలికా
స్వరరాగ గంగా ప్రవాహమే
గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసస……….
కుండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో
కురిసెను రాగం ఈనాటికి
మట్టింటిరాయే మాణిక్యమై పోయే
సంగీత రత్నాకరానా
స్వరసప్తకాలే కెరటాలు కాగ
ఆ గంగ పొంగింది లోనా
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా
గాన సరసీరుహ మాలికా
స్వరరాగ గంగా ప్రవాహమే
చైతన్య వర్ణాల… ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు… పలికే దిగంతాలు
పులకింతల పుష్య రాగాలులే
మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా
గాన సరసీరుహ మాలికా
స్వరరాగ గంగా ప్రవాహమే
స్వరరాగ గంగ ప్రవాహమే
Swararaga Ganga Pravahame song is from the Sarigamalu movie.
Swararaga Ganga Pravahame song was sung by K J Yesudas, Chitra.
Swararaga Ganga Pravahame song lyrics were written by Veturi Sundararama Murthy.
Swararaga Ganga Pravahame song music was composed by Ravi.