
| Movie Name | & English - Loafer |
|---|---|
| Director | Puri Jagannadh |
| Star Cast | Varun Tej, Disha Patani |
| Music | Sunil Kashyap |
| Singer(s) | Karunya |
| Lyricist | Suddala Ashok Teja |
| Music Label | Aditya Music |
హో, సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
నువ్వే గీసిందమ్మా మాట్టాడే ఈ బొమ్మ
నా తలపై సెయ్యే పెట్టి
నీ కడుపుల పేగును అడుగు
మన ఇద్దారి నడుమున ముడి ఏందో
అది గొంతెత్తి సెప్పుతాది వినుకోవే
దునియాతో నాకేంటమ్మ
నీతో ఉంటె సాలమ్మా ఆ ఆ ఆఆ
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో
నేను ఊగింది నీ ఓడూయలో
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో
నువ్వే సెప్పాలి అమ్మ, అమ్మెవ్వలో
సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
నువ్వే గీసిందమ్మా మాట్టాడే ఈ బొమ్మ
ఏ, కాళ్ళ మీద బజ్జోబెట్టి లాల పోసినావో ఏమో
మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తనేమో సూడు
ఎండి గిన్నెల్లో ఉగ్గు పాలు పోసి
నింగి సందమామను నువ్వు పిల్వలేదా
అవునో కాదంటే నువ్వు అడగవమ్మా
మబ్బు సినుకై సెప్తాది నీకు ఎన్నెలమ్మ
దునియాతో నాకేంటమ్మ
నీతో ఉంటె చాలమ్మా ఆ ఆ ఆ ఆఆ
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో
నేను ఊగింది ని ఓడూయలో
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో
నువ్వే సెప్పాలి అమ్మ, అమ్మెవ్వలో
సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
నువ్వే గీసిందమ్మా మాట్టాడే ఈ బొమ్మ
తల్లి కోడి పిల్లనొచ్చి తన్నుకెళ్ళే గద్దలెక్క
ఎత్తుకెల్లినోడు నన్ను పెంచలేదు మనిషిలెక్క
సెడ్డదారుల్లో నేను ఎళ్ళినాక
సెంప దెబ్బ కొట్టేసి మార్చె తల్లి లేక
ఎట్టాపడితేను అట్ట బతికినానే
ఇప్పుడిట్టా వస్తేను తలుపు ముయ్యబోకే
దునియాతో నాకేంటమ్మ
నీతో ఉంటె చాలమ్మా ఆ ఆ ఆఆ
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో
నేను ఊగింది నీ ఓడూయలో
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో
నువ్వే చెప్పాలి అమ్మ, అమ్మెవ్వలో
సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
నువ్వే గీసిందమ్మా మాట్టాడే ఈ బొమ్మ
నా తలపై సెయ్యే పెట్టి
నీ కడుపుల పేగును అడుగు
మన ఇద్దారి నడుమున ముడి ఏందో
అది గొంతెత్తి సెప్పుతాది వినుకోవే
దునియాతో నాకేంటమ్మ
నీతో ఉంటె సాలమ్మా ఆ ఆ ఆఆ
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో
నేను ఊగింది నీ ఓడూయలో
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో
నువ్వే సెప్పాలి అమ్మ, అమ్మెవ్వలో
Suvvi Suvvalamma song is from the & English - Loafer movie.
Suvvi Suvvalamma song was sung by Karunya.
Suvvi Suvvalamma song lyrics were written by Suddala Ashok Teja.
Suvvi Suvvalamma song music was composed by Sunil Kashyap.