
| Movie Name | Gayam (1993) |
|---|---|
| Director | Ram Gopal Varma |
| Star Cast | Jagapathi Babu, Revathi, Urmila |
| Music | SRI |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికాసమెందుకని
నిజాన్ని బలికోరే… సమాజమెందుకని
అడుగుతోంది అదిగో… ఎగిరే భరత పతాకం
ఆవేశంలో ప్రతినిమిషం
ఉరికే నిప్పుల జలపాతం
కత్తికొనల ఈ వర్తమానమున
బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు
పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై
ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో
ఎగిరే భరత పతాకం
చెరుగుతుంది ఆ తల్లి
చరితలో విశ్వ విజయాల విభవం
సురాజ్యమనలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికాసమెందుకని
కులమతాల దవానలానికి
కరుగుతున్నది మంచు శిఖరం
కలహముల హాల హలానికి
మరుగుతున్నది హిందు సంద్రం
దేశమంటే మట్టి కాదను మాట
మరచేను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన
రాచకురుపీ రాజకీయం
విషం చిమ్మెను జాతి తనువున
ఈ వికృత గాయం
Surajyamavaleni song is from the Gayam movie.
Surajyamavaleni song was sung by S P Balasubramanyam.
Surajyamavaleni song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Surajyamavaleni song music was composed by SRI.