Suddala Nissar Corona Song Lyrics - Nissar Lockdown

Suddala Nissar Corona Song Lyrics: Suddala Nissar Corona is a Telugu song from the film Nissar Lockdown.

Suddala Nissar Corona Song Details

Movie NameNissar Lockdown
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Suddala Nissar Corona Song Lyrics in Telugu

ముదనాష్టమీకాలం ఇంకెంతకాలమో… కష్టాలు మోపాయెరన్నా

ఎవరింట్ల వాళ్ళమే బంధీలమైతిమి… బైటెట్ల పడ్తమోరన్నా…

ముదనాష్టమీకాలం ఇంకెంతకాలమో… కష్టాలు మోపాయెరన్నా

ఎవరింట్ల వాళ్ళమే బంధీలమైతిమి… బైటెట్ల పడ్తమోరన్నా…

అద్దె గట్టామాయె… అప్పు పెరిగిపాయె…

వచ్చిన జీతమూ వడ్డీలకేనాయె…

చిట్టి గట్టామాయె… ఉట్టి చేతులాయె…

పిల్లలా ఫీజులా ఫిగర్‌ పెరిగిపాయె…

కంపెనీ బందాయె… కొంప గడవదాయె…

కడుపు నింపేదెట్లరన్నో… రెక్కాడితే గానీ డొక్కాడనోళ్లము

దిక్కులేకుంటైతిమి అన్నా…

ముదనాష్టమీకాలం ఇంకెంతకాలమో… కష్టాలు మోపాయెరన్నా

ఎవరింట్ల వాళ్ళమే బంధీలమైతిమి… బైటెట్ల పడ్తమోరన్నా…

అడ్డమీదీ బతుకు… అడ్రస్సు గల్లంతు…

వలస కూలీలంతా… పలుసనై పోయిండ్రు

పానీపూరీ, భజ్జీ… ఛాయ, జ్యూసు బండ్లు

చక్రాలు తిరగకా… చెమ్మగిల్లే కండ్లు…

అర్ధరాతిరి ఏ ఆపదొచ్చిన గానీ అవతలీకెళ్లలేమన్నో…

రైళ్లు, బస్సులు, బండ్లు బంద్‌వెడితే… కాళ్లు నరికేసినట్టాయెరన్నా…

ముదనాష్టమీకాలం ఇంకెంతకాలమో… కష్టాలు మోపాయెరన్నా

ఎవరింట్ల వాళ్ళమే బంధీలమైతిమి… బైటెట్ల పడ్తమోరన్నా

పెట్టుకున్నా పెళ్ళి ఆగిపోయినాది… దూరమున్న కొడుకు దరికి చేరడాయె

ఇంట్లెవరు చచ్చినా ఇరుగుపొరుగు రారు…

కడసూపు నోసని కన్నీటి గాధలు…

కరోనా రోగంతో ముందు జాగ్రత్తలే… కాపాడే మందూలోరన్నా

వ్యాక్సినొచ్చేదాకా మాస్క్‌ పెట్టుకోని… మందితో దూరముండన్నా…

కరోనా రోగంతో ముందు జాగ్రత్తలే… కాపాడే మందూలోరన్నా

వ్యాక్సినొచ్చేదాకా మాస్క్‌ పెట్టుకోని… మందితో దూరముండన్నా

నవ్వు మందితో దూరముండన్నా…

Watch నిస్సర్ కరోనా వీడియో పాట

https://10to5.in/wp-content/uploads/2020/07/Nissar.mp4

Share this Song!

More Songs from Nissar Lockdown Movie

  1. Suddala Nissar Corona Song Lyrics

Suddala Nissar Corona Song FAQ

What movie is Suddala Nissar Corona song from?

Suddala Nissar Corona song is from the Nissar Lockdown movie.