
Song Name : Srustiki jeevam posinadhi rendaskarala prema
Lyrics : Thirupathi matla
Singer : Thirupathi matla
Srustiki jeevam posinadhi rendaskarala prema Song Lyrics
ఆ ఆ ఆ.... సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ...
నీగర్భగుడిలొ పురుడోసుకున్నదే మానవ చిరునామా....
అమ్మా ...అమ్మా ...
అమ్మా ... అమ్మా ...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ ...
నీ గర్భగుడిలొ పురుడోసుకున్నదే
మానవ చిరునామా ...
సకల చరాచర జీవజాతులను కొలువుతీరినది నీ రూపం ...
నీ చనుపాలకు అనురాగం పంచె అమ్మతనం నీ జన్మ గుణం
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
ఆఆఆ...
ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తీ...
అణువు అణువణువు నొప్పులతో భరించేటి
ఓ మాతృ మూర్తీ...
నీపొత్తిల్లలో చిరునవ్వులచూసి తొమ్మిదినెలల బాధలు మరిచి
అమ్మా ... అమ్మా...
అమ్మా... అమ్మా...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ...
నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా....
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
ఒంటిలొ సత్తువ వత్తిగచేసి నెత్తుటిచుక్కల చమురుగ పోసి ..
పసిబిడ్డలాల ప్రాణదీపాల్ని వెలిగించబూనినావే నీ ఉసురు ఎల్లిపోతున్నగాని ...
యముడి గుమ్మానికి ఎదురుగ నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ
ఒడిచేరిన బిడ్డా ... ఎదరు ముద్దాడగా బిగపట్టి ఊపిరి ఒక్కసారి కనురెప్పలల్ల కన్నీరులజారి కన్న ప్రేమకు నిండు సాక్షమై నిలిసెనే.. అమ్మ
అమ్మా...అమ్మా... అమ్మా...అమ్మా...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ ..
నీ గర్భగుడిలొ పురుడోసుకున్నదే మానవ చిరునామా ...
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
గోలచేసినా.. గోముగ ముద్దాడినవే అమ్మ గోరుముద్దలు తినిపించీ
నన్ను బుజ్జగించినావమ్మ ..
అల్లరి మాని అలిగితె నేను అల్లాడినవే అమ్మ
నీ గుండెలపైన బజ్జోలని జోలపాడినావమ్మ
లేరమ్మని కన్నగొప్పవారు గుడిలోనా ..
లేరమ్మ గొప్పవారు నీ కన్న ఇలలోనా ..
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలొ పురుడోసుకున్నదే మానవ చిరునామా
Srustiki jeevam posinadhi song is from the Matti Parimalam movie.