
| Movie Name | Kudirithe Kappu Coffee (2011) |
|---|---|
| Director | Ramana Salva |
| Star Cast | Varun Sandesh, Suma Bhattacharya |
| Music | Yogeshwara Sharma |
| Singer(s) | S P Balasubramanyam & DJ Nihal |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
శ్రీకారం చుడుతున్నట్టు… కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయే… మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు… రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు… దాక్కుందే బంగరు బొమ్మా
శ్రీకారం చుడుతున్నట్టు… కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయే… మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు… రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు… దాక్కుందే బంగరుబొమ్మా
ధూం తనన…
జల జల జల జాజుల వాన… కిల కిల కిల కిన్నెర వీణ
మిల మిల మిన్నంచులపైన… మెలిదిరిగిన చెంచల యాన
మధురోహల లాహిరిలోన… మదినూపే మదిరవె జాణ
నీ నడకలు నీవేనా… చూశావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద… పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తైనా… నీ వెనకాలేమౌతున్నా
నీ వీపును ముళ్ళే గుచ్చే… కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు… లావణ్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో… నీకైనా నీ తీరు
నీగాలే సోకినవారు… గాలిబ్ గజలైపోతారు
నీ మేను తాకినవారు… నిలువెల్లా విరులౌతారు
కవితవో యువతివో ఎవతివో… గుర్తించేదెట్టాగమ్మా
ధూం తనన…
నక్షత్రాలెన్నంటూ లెక్కడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు… చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటూ… ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ… నిద్దురనే వెలివేయద్దు
వేకువనే లాక్కొచ్చేట్టు… వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ… తక్షణమే హాజరయేట్టు
అందాకా మారామ్మాని… జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణి… జాగారం ఎందుక్కాని
నడిమివో హరిణివో తరుణివో… మురిపించే ముద్దులగుమ్మ
Srikaram Chuduthunnattu song is from the Kudirithe Kappu Coffee movie.
Srikaram Chuduthunnattu song was sung by S P Balasubramanyam & DJ Nihal.
Srikaram Chuduthunnattu song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Srikaram Chuduthunnattu song music was composed by Yogeshwara Sharma.