
| Movie Name | Rahasyam (1967) |
|---|---|
| Director | Vedantam Raghavaiah |
| Star Cast | ANR, B Saroja Devi |
| Music | Ghantasala |
| Singer(s) | P Leela |
| Lyricist | Malladi Ramakrishna Sastry |
| Music Label | Saregama Telugu |
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
జగముల చిరు నగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
జగముల చిరు నగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై… స్మరణే జీవనమై
మనసే నీ వశమై… స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ నాయకి
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
అందరికన్నా చక్కని తల్లికి… సూర్యహారతి
అందలేలే చల్లని తల్లికి… చంద్రహారతి
రవ్వల తళుకుల కలలా జ్యోతుల… కర్పూరహారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద
Sri Lalitha Siva Jyothi song is from the Rahasyam movie.
Sri Lalitha Siva Jyothi song was sung by P Leela.
Sri Lalitha Siva Jyothi song lyrics were written by Malladi Ramakrishna Sastry.
Sri Lalitha Siva Jyothi song music was composed by Ghantasala.