
| Movie Name | & English - Charan Arjun, Narsanna |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | himself |
| Singer(s) | Charan Arjun, Nalgonda Gaddar Narsanna, Suresh Kumar Bodasingi, Deepthi Sayanora, Ashwini |
| Lyricist | |
| Music Label |
SPB Katha Gaanam Lyrics In Telugu
కొనేటమ్మ పేట లోన పాట పుట్టింది… ఊఉ ఊఉ
ఈనాటికి ఈ పాటకదే రూపమయ్యింది… ఊఉ ఊఉ
సాంబమూర్తి, శకుంతల పంట పండింది…
శ్రీపతి పండితారాధ్యుల ఇల్లంత వెళ్ళివిరిసింది…
అయ్య చెప్పే హరికథ… అబ్బినది జన్మతః
అక్కడే మొదలటా తనలో పాటా… (అక్కడే మొదలటా తనలో పాటా)
పల్లవినే కన్నడు, చరణం కనుగొన్నడు
ఆ పాట గాడి పాటనలో పలుకుతుందట
(ఆ పాట గాడి పాటనలో పలుకుతుందట)
అతడో పాటల మూట… ఆఆ ఆ
అందని శిఖరపు కోటా… గాన గంధర్వుడటా… ఆ ఆఆ
తన కధ విను ఈ పూట…
కొనేటమ్మ పేట లోన పాట పుట్టింది… ఏ ఏఏ
ఈనాటికి ఈ పాటకదే రూపమయ్యింది… ఏ ఏఏ
ముగ్గురు సోదరులు, ఐదుగురు ఆడపిల్లలూ
ముచ్చటగా వెలిగే… అచ్చ తెలుగు ఇంటిలో
సర్కారు ఇంజినీరు కావాలన్న ఆశయం
మద్రాసు బండెక్కి తండ్రి కోసం ఆ క్షణం
తనకే తెలియకుండ స్నేహితుడి చొరవతో
పాటల బాటలోకి నడిచాడీబాలుడు
స్వచ్ఛంగా అబ్బిన తన సంగీతా జ్ఞానము
సరిపోదనుకొని వెనుదిరిగాడు ఈ వీరుడు
అయినా ఆ దేవుడు ఎతికి ఎంట పడ్డడో
కోదండపాణి రూపాన ఆదుకున్నడో
గన్న పాటే నీకు అన్నం పెడుతుందనీ
అన్నా జానకమ్మ మాట నమ్ముకున్నడో
చెమటన తడిసి శిఖర కోటకు ఎగబాకెనో…
కదిలే జ్వాలై నిరతం… ఊఉ ఊ
ఎగసే పాటల కెరటం… ఊఉ ఊ
వినయం తన ఆభరణం… ఊఉ ఊ
విజయం తన దాసోహం… ఊఉ ఊ
ఏ సిత్రం జరిగెనో… సావిత్రిని వలచెను
(ఏ సిత్రం జరిగెనో… సావిత్రిని వలచెను)
ఈ బాలుడు ఐనడు… పరిపూర్ణ పురుషుడు
పల్లవి చరణాలతో ఇల్లు కోవెలైనది
చెల్లి శైలజమ్మతోటి కోయిలైనది
రోజుకు వంద కూడ పాడినాడు పాటలు
ఒకటే బాష కాదు దేశమంత ఎదిగెను
అన్నయ్య విశ్వనాథు అందించిన గర్వం
మెడలో స్వరమాల శంకరాభరణం
తెరపై నటుల బట్టి మారును తన గానము
నటులకే కాదు దేవుడికె గాత్ర దానము
తెలుగు భాషంటే తనకు పంచప్రాణము
బహుముఖప్రజ్ఞ పేరే బాలసుబ్రమణ్యము
మారుమూలన మాలాంటి పల్లె గొంతులు
వేధికనిచ్చి తను వెలుగులోకి తెచ్చెను
మనుషులలోని రుగ్మతలు రూపుమాపగా
పాటలతోనే చేశాడు కొత్త వైద్యము
మనిషి రూపునున్న మధుర మంత్రముగ్ధమో…
నటనా సంగీతమూ… ఊఉ ఊ
సినిమా నిర్మాణమూ… ఊఉ ఊ
తరములు మారినగానీ… ఈఈ ఈ
తరగని అభిమానమూ… ఊఉ ఊ
Also Read: Evalu Rammanaru Kodaka Lyrics
SPB Katha Gaanam song is from the & English - Charan Arjun, Narsanna movie.
SPB Katha Gaanam song was sung by Charan Arjun, Nalgonda Gaddar Narsanna, Suresh Kumar Bodasingi, Deepthi Sayanora, Ashwini.
SPB Katha Gaanam song music was composed by himself.