
| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
నుదుట కుంకుమ రవిబింబముగా
కన్నుల నిండుగా… కాటుక వెలుగా ||2||
కాంచన హారము… గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండుగా…
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
నిండుగ కరముల… బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు ||2||
గల గల గలమని… సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల… సేవలు నందగా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
నిత్యసుమంగళి నిత్యకళ్యాణి… భక్తజనులకూ కల్పవల్లి ||2||
కమలాసనవై కరుణనిండగా… కనకవృష్టి కురిపించే తల్లి
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
జనకరాజుని ముద్దుల కొమరిత… రవికులసోముని రమణీమణివై ||2||
సాథుసజ్జనుల పూజలందుకొని… శుభములనిచ్చెడి దీవనలీయగ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
కుంకుమ శోభిత పంకజలోచని… వెంకటరమణుని పట్టపురాణి ||2||
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే… పుణ్యమూర్తి మాయింట వెలసిన
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
సౌభాగ్యమ్ముల బంగరుతల్లి… పురందర విఠలుని పట్టపురాణి ||2||
శుక్రవారంబు పూజలందుకొన… సాయంసంధ్యా శుభఘడియలుగా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
Sowbhagya Lakshmi Ravamma song is from the movie.