
| Movie Name | FOLK 6 (2025) |
|---|---|
| Director | MUNNA |
| Star Cast | VAISHANAVI SONY , KITTUPAVAN |
| Music | MADEEN SK |
| Singer(s) | BODDU DILIP BATTU SAILAJA |
| Lyricist | DILIP SAINAYAK |
| Music Label |
పాట: సిత్తురాల సీతమ్మ (Sithurala Seethamma)
నిర్మాత: మున్నా (Munna)
సాహిత్యం: దిలీప్ సాయినాయక్ (Dilip Sainayak)
సంగీతం : మదీన్ SK (Madeen SK)
నటీనటులు: వైషానవి సోనీ (Vaishanavi Sony ), కిట్టుపవన్ (KittuPavan),
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : మున్నా (Munna)
గాయకులు : బొడ్డు దిలీప్ (Boddu Dilip) బట్టు శైలజ (Battu Sailaja)
పూల పూల చీర మీద సీతాకోకలేవమ్మో సిత్తురాల సీతమ్మ
సీతాకోకలేవమ్మో సిత్తూరాల సీతమ్మ
హ! ముద్దు ముద్దు మాటలాడి మాయ సేయ్యకు మావయ్యో
నాయి ముద్దుల రామయ్య
నన్ను మాయ సేయ్యకు మావయ్యో
నాయి ముద్దుల రామయ్య
యేలు పట్టుకుంటనే.. ఓ సీతమ్మ
నీకు తాళి బొట్టునైతనే.. నా సీతమ్మ
యేలు పట్టుకుంటనే.. ఓ సీతమ్మ
నీకు తాళి బొట్టునైతనే.. నా సీతమ్మ
ముద్దు ముద్దు మాటలాడి మాయ సేయ్యకు మావయ్యో
నాయి ముద్దుల రామయ్య
నన్ను మాయ సేయ్యకు మావయ్యో
నాయి ముద్దుల రామయ్య
కొత్త చీర కొత్త రైక కోరా మీసాల మావయ్య
సుట్టూమారు తిరుగుతున్న సూడవేంది రామయ్య
సుట్టు ముట్టు చుట్టాల నడుమ చూసేదేలా సీతమ్మ
చీరకొంగు చాలే పిల్ల చేరుకుంటా గుండెల్లా
అందగాడివేలే ఓ రామయ్య
నువ్వు నాకు సొంతమేలే నా రామయ్య
అందగాడివేలే ఓ రామయ్య
నువ్వు నాకు సొంతమేలే నా రామయ్య
పూల పూల చీర మీద సీతాకోకలేవమ్మో సిత్తురాల సీతమ్మ
సీతాకోకలేవమ్మో సిత్తూరాల సీతమ్మ
బాయికాడ బంతి తోట రాయే పిల్ల సీతమ్మ
రంగు రంగుల గాజులు తెస్తి పెట్టుకోవే సేతుల్లా
చేనుకాడ అన్నలున్నారు వచ్చేదేలా మావయ్య
సాటునుండి రమ్మనంటే రాకపోతివి రామయ్య
నీ అన్నలంటే ఎవ్వాలే.. ఓ సీతమ్మ
నా బామ్మర్దులేగా.. నా సీతమ్మ
నీ అన్నలంటే ఎవ్వాలే.. ఓ సీతమ్మ
నా బామ్మర్దులేగా.. నా సీతమ్మ
హ! ముద్దు ముద్దు మాటలాడి మాయ సేయ్యకు మావయ్యో
నాయి ముద్దుల రామయ్య
నన్ను మాయ సేయ్యకు మావయ్యో
నాయి ముద్దుల రామయ్య
నిండు పున్నమి ఎన్నెలలోన నవ్వుల నా రాణి సీతమ్మ
మంచెకాడ ముసిరి ముసిరి ముచ్చటలాడ రావమ్మా
మాటలతోని మాయ చేసి మలుపుకున్నావు రామయ్య
వేల వేల జన్మలు నీతో ఉంటా మావయ్య
నీ నీడనై ఉంటేనే.. ఓ సీతమ్మ
నీకు తాళి బొట్టునైతనే.. నా సీతమ్మ
నీ నీడనై ఉంటేనే.. ఓ సీతమ్మ
నీకు తాళి బొట్టునైతనే.. నా సీతమ్మ
అరె! ముద్దు ముద్దు మాటలాడి మాయ సేయ్యకు మావయ్యో
నాయి ముద్దుల రామయ్య
నన్ను మాయ సేయ్యకు మావయ్యో
నాయి ముద్దుల రామయ్య
SITURALA SEETHAMMA song is from the FOLK 6 movie.
SITURALA SEETHAMMA song was sung by BODDU DILIP BATTU SAILAJA.
SITURALA SEETHAMMA song lyrics were written by DILIP SAINAYAK.
SITURALA SEETHAMMA song music was composed by MADEEN SK.