
| Movie Name | Shyam Singha Roy, Nani |
|---|---|
| Director | Rahul Sankrityan |
| Star Cast | Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian |
| Music | Mickey J Meyer |
| Singer(s) | Chaitra Ambadipudi, Anurag Kulkarni |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Saregama Telugu |
Sirivennela Female Version Lyrics in Telugu
డుం డక డుం డక
నెల రాజుని… ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెలా
దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరిచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటి కలా
ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి
అయ్యహా ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్ఠికే అద్దము చూపగ
పుట్టినదేమో నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
ఇదిలా అని
ఎవరైనా చూపనేలేదు కంటికీ
అదెలాగో తనకైనా
తోచనేలేదు మాటకి
ఇపుడిపుడే మనసైన
రేపు దొరికింది చూపుకి
కథ కదిలే వరసనా
తమ ఎదలేం తడిసినా
గత జన్మల పొడవున
దాచిన దాహము
ఇపుడే వీరికి పరిచయమా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
Sirivennela Female Version song is from the Shyam Singha Roy, Nani movie.
Sirivennela Female Version song was sung by Chaitra Ambadipudi, Anurag Kulkarni.
Sirivennela Female Version song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Sirivennela Female Version song music was composed by Mickey J Meyer.