Singer Shirisha Ugadi Song Lyrics - Prakruthike Pachhadanam

Singer Shirisha Ugadi Song Lyrics - Prakruthike Pachhadanam
Singer Shirisha Ugadi Song Lyrics: Singer Shirisha Ugadi is a Telugu song from the film Prakruthike Pachhadanam, directed by Ranganadh Kalinga. "Singer Shirisha Ugadi" song was composed by Ram Pydisetty and sung by Shirisha. Lyrics were written by Bagadi Sudheer Kumar.

Singer Shirisha Ugadi Song Details

Movie NamePrakruthike Pachhadanam
DirectorRanganadh Kalinga
Star Cast
MusicRam Pydisetty
Singer(s)Shirisha
LyricistBagadi Sudheer Kumar
Music LabelGoviLTV

Singer Shirisha Ugadi Song Lyrics in Telugu

సింగర్: శిరీష

నిర్మాత: డి. కళ్యాణి

ప్రకృతికే పచ్చదనం.. సంస్కృతికే జన్మదినం

షడ్రుచులా కమ్మదనం.. తెలుగింటి పర్వదినం…

వేప మావిళ్ల పూతలతో.. కుహు కోయిల్ల కూతలతో..

వేల వర్ణాల పువ్వులతో.. నేల సిగలోన నవ్వులతో…

వచ్చెనంట.. తెచ్చెనంట సంబరాల అంబరాన్ని…

ఆది యుగాది ఉగాది.. ఆరంభమైంది ఏడాది..

ఆది యుగాది ఉగాది.. ఆరంభమైంది ఏడాది…

ప్రకృతికే పచ్చదనం.. సంస్కృతికే జన్మదినం

షడ్రుచులా కమ్మదనం.. తెలుగింటి పర్వదినం…

ఏరువాక సాగుతుంటె పారుతుండగా నీళ్ళు..

నేలతల్లి గుండెల్లోన పొంగెనంట సరదాలు…

గుమ్మాలకందంగా మావి తోరణాలు.. కమ్మంగ నోరూరుతున్న పచ్చళ్ళు..

అందాలు చిందించు పట్టు పరికిణీలు.. ఆచారమందించు తెలుగు పంచకట్టులు…

కొత్త పంచాంగ శ్రవణాలు.. మిత్ర బంధాల కలయికలు..

తల్లి గోమాతకే పూజలు.. పల్లె భూమాత దీవెనలు..

ఇచ్చెనంట తెలుగింట సంపదల ఉత్సవాది…

ఆది యుగాది ఉగాది.. ఆరంభమైంది ఏడాది..

ఆది యుగాది ఉగాది.. ఆరంభమైంది ఏడాది…

బతుకు బండిలోన భారమైన అనుభవాలే.. చేదంటే..

నిండు గుండెలోన అంతులేని సంతసాలే.. తీపంటే..

ఉప్పంటే.. ఉరకేయు ఉల్లాసాలే.. వగరంటే నీలోన ఉన్న సహనాలే..

నీ కోపతాపములే కారమంటే.. నీలోని పోరాటమే పులుపంటే..

బతుకు షడ్రుచుల సమ్మిళితం.. ఆరు ఋతువుల్లొ పరమార్థం..

తెలుసుకో అంటూ సత్యాన్ని.. మలుచుకో అంటూ జీవితాన్ని..

వచ్చెనంట.. తెచ్చెనంట సంబరాల అంబరాన్ని…

ఆది యుగాది ఉగాది.. ఆరంభమైంది ఏడాది..

ఆది యుగాది ఉగాది.. ఆరంభమైంది ఏడాది…

ప్రకృతికే పచ్చదనం.. సంస్కృతికే జన్మదినం

షడ్రుచులా కమ్మదనం.. తెలుగింటి పర్వదినం…

వేప మావిళ్ల పూతలతో.. కుహు కోయిల్ల కూతలతో..

వేళా వర్ణాల పువ్వులతో.. నేల సిగలోన నవ్వులతో…

వచ్చెనంట.. తెచ్చెనంట సంబరాల అంబరాన్ని…

ఆది యుగాది ఉగాది.. ఆరంభమైంది ఏడాది..

ఆది యుగాది ఉగాది.. ఆరంభమైంది ఏడాది…

ఏరువాక లిరిక్స్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Prakruthike Pachhadanam Movie

  1. Singer Shirisha Ugadi Song Lyrics

Singer Shirisha Ugadi Song FAQ

What movie is Singer Shirisha Ugadi song from?

Singer Shirisha Ugadi song is from the Prakruthike Pachhadanam movie.

Who sang Singer Shirisha Ugadi song?

Singer Shirisha Ugadi song was sung by Shirisha.

Who wrote Singer Shirisha Ugadi song lyrics?

Singer Shirisha Ugadi song lyrics were written by Bagadi Sudheer Kumar.

Who composed music for Singer Shirisha Ugadi song?

Singer Shirisha Ugadi song music was composed by Ram Pydisetty.