
| Movie Name | Swayamkrushi, Chiranjeevi |
|---|---|
| Director | K Viswanath |
| Star Cast | Chiranjeevi, Vijayashanti, Sumalatha |
| Music | Ramesh Naidu |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki & SP Sailaja |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Lahari Music |
సిగ్గు పూబంతి
విసిరే సీత మా లచ్చి
సిగ్గు పూబంతి
ఇసిరే సీత మా లచ్చి
మొగ్గ సింగారం
ఇరిసే సుదతి మీనాచ్చి
మొగ్గ సింగారం
ఇరిసే సుదతి మీనాచ్చి
సొగసు సంపెంగ
గుత్తులు మెత్తగ తాకంగా
సొగసు సంపెంగ
గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో
కాముడి సింతలు రేపంగా
సిగ్గు పూబంతి ఇసిరే
సీత మా లచ్చి
విరజాజి పూల బంతి
అర సేత మోయలేని
విరజాజి పూల బంతి
అర సేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా
శివుని విల్లు మోసిన జాణ
ఈ సిన్నదేనా
ఔరా అని రామయ కన్నులు
మేలమాడి నవ్విన సిన్నెలు
ఔరా అని రామయ కన్నులు
మేలమాడి నవ్విన సిన్నెలు
సూసీ అలకలొచ్చిన కలికి
సూసీ అలకలొచ్చిన కలికి
ఏసినాది కులుకుల మెలికి
సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే… సీత మా లచ్చి
సిరసొంచి కూరుసున్న
గురిసూసి సేరుతున్న
సిరసొంచి కూరుసున్న
గురిసూసి సేరుతున్న
సిలకమ్మ కొన సూపు సౌరు
బొండు మల్లె చెండు జోరు
సేరే ఆ సూపుల తళుకు
ముసురుతున్న రామయ్య రూపు
సేరే ఆ సూపుల తళుకు
ముసురుతున్న రామయ్య రూపు
మెరిసే నల్ల మబ్బైనాది
మెరిసే నల్ల మబ్బైనాది
వలపు జల్లు వరదైనాది
సిగ్గు పూబంతి ఇసిరే… సీత మా లచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే… సీత మా లచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సొగసు సంపెంగ
గుత్తులు మెత్తగ తాకంగా
సొగసు సంపెంగ
గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో
కాముడి సింతలు రేపంగా
సిగ్గు పూబంతి ఇసిరే
సీత మా లచ్చి
Siggu Poobanthi song is from the Swayamkrushi, Chiranjeevi movie.
Siggu Poobanthi song was sung by S P Balasubramanyam, S Janaki & SP Sailaja.
Siggu Poobanthi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Siggu Poobanthi song music was composed by Ramesh Naidu.