Movie Name | SHIVARATRI SONG 2025 (2025) |
---|---|
Director | |
Star Cast | paindlarajesh |
Music | SK BAJI |
Singer(s) | LAKSHMI PRASANNA |
Lyricist | Tharunsaidul |
Music Label | SINGER LAKSHAMMAKA |
ఎల్లా లోకాలేలేవు తండ్రి శివయ్యా ..
నీ సల్లానైనా నీడలోన మేమున్నమయ్యా ..
మా గుండేనిండా నీవేగా జంగమ దేవా ...
కైలాస వాస నీ సేవలొ అంకితమయ్యా
నీలాకంఠ నీ మహిమలు ఆటే నయ్య
మా ఇంట ఇంట ని దీవెనలుండే నయ్యా ..
వేల వేల రూపాలాన్ని నీవే శివయ్యా
శివ శివ శంకర అనని రోజే లేదయ్యా ..
నంది వాహనమే సై అంటూ నీకు తయ్యారే ..
శివ శివ అంటూ జేసేమయ్యా నీకు జాతరలే ..
ఏ పాలు పండ్లు నైవేద్యాలు నీ పూజగోరె ...
చేసేమయ్యా పాటా పాడుతూ నీకభిషేకాలే ..
చరణం:
బగ్గుమనే మంట కంట వెట్టుకున్నావు శివయ్యా
జిల్లుమనే గంగ నెత్తినెట్టుకున్నావు సాంబయ్య..
నాగుపాము మెడలోనా హారమేగా శివయ్యా
గరళాకంఠ ఎంతో దండి వాడవు నీవయ్యా .
దిక్కులన్నీ బట్టగ గట్టి
బూడిదనే ఒంటికి దట్టి
డమ డమ డమ డమరుక నాదంలో
అమ్మతో కూడి తాండవమాడి
త్రిశూల ధారుడవయ్యా
రుద్రాక్ష కారుడవయ్యా ..
చల్లని చూపుల దేవుడవయ్య
విశ్వమంత నిండి ఉన్నవయ్యా ..
నంది వాహనమే సై అంటూ నీకు తయ్యారే ..
శివ శివ అంటూ జేసేమయ్యా నీకు జాతరలే ..
ఏ పాలు పండ్లు నైవేద్యాలు నీ పూజగోరె ...
చేసేమయ్యా పాటా వాడుతూ నికభిషేకాలే ..
చరణం:
చెంబేడు నీళ్ళకే ద్రవించి పొతావయ్యా ...
మారేడు ఆకులకే మురిసి పోతావు లేవయ్య
భక్తుల బాధ చూస్తే చలించిపోతావయ్యా
నిత్యము మమ్ము కాసే కాశి విశ్వనాథయ్య
గంగ నది లో స్నానాలు ..
జన్మ ధన్యమయ్యా చాలు
చితి భస్మం లో నీరూపాలు
కట్టే కాలుతున్న విడువవు తోడు
వారణాసి నీ పాదాలు ..
ధూళి తగిలినా పాపాలు
తీరునయ్య నీ నీడలో స్వామి
కాలభైరవుడే అందుకు సాక్షి
నంది వాహనమే సై అంటూ నీకు తయ్యారే ..
శివ శివ అంటూ జేసేమయ్యా నీకు జాతరలే ..
ఏ పాలు పండ్లు నైవేధ్యాలు ని పూజగోరె ...
చేసేమయ్యా పాటా వాడుతూ నికభిషేకాలే ..