Shirisha Sri Rama Navami Song Lyrics - & English - Egillu Varanga

Shirisha Sri Rama Navami Song Lyrics - & English - Egillu Varanga
Shirisha Sri Rama Navami Song Lyrics: Shirisha Sri Rama Navami is a Telugu song from the film & English - Egillu Varanga.

Shirisha Sri Rama Navami Song Details

Movie Name& English - Egillu Varanga
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Shirisha Sri Rama Navami Song Lyrics in Telugu

సింగర్: శిరీష

కాస్టింగ్: శిరీష

లిరిక్స్: పోతవేణి గంగారాం గౌడ్

మ్యూజిక్: ప్రవీణ్ కైతోజు

లేబుల్: సింగర్ శిరీష

ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..

ఎర్రాటెండాకాలం మబ్బూల లేవయ్య… సల్లా గోదావరిలో తానాలు చేయవయ్యా…

ఏగిల్లు వారింది కోదండ రామయ్య..

ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..

పచ్చా ఉంగరము నీకు పయిలంగా తొడిగితినయ్యా… అల్లీ పూదండా నీకు అల్లితినయ్యా…

సిలకా కొట్టిన పండ్లు.. సిరినవ్వుతో తినవయ్యా…

టేకు దోనెల పట్టు తేనెలు తాగవయ్య..

ఏగిల్లు వారింది కోదండ రామయ్య..

ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..

హొయ్యారే హొయ్ హొయ్.. హొయ్యారే హొయ్ హొయ్ హొయ్… హొయ్యారే..

అడివమ్మా ఒడిలాకెళ్ళి.. ఇప్పా పువ్వు తెస్తినయ్యా…

గోదారి నీళ్ళ తోని.. పాదాలు కడిగామయ్య…

అమ్మా సీతమ్మతో పుట్టిలో కూసోవయ్య…

పసుపు తాళి కట్టీ ఏలుకోరావయ్య…

ఏగిల్లు వారింది కోదండ రామయ్య..

ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..

రామయ్యా… భద్రాచల రామయ్యా…

హనుమయ్య తీరు నిన్నూ కొలుచుకుంటానయ్య…

లచుమయ్య తీరు వెంట అంటి ఉంటామయ్య..

రామదాసు తీరు నీ పాటనైతానయ్య…

అయ్యా నీ గుడికి రాతి ముగురామునైతానయ్య…

ఏగిల్లు వారింది కోదండ రామయ్య..

ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..

ఈ తీరం నుండి నిన్ను ఆ తీరం చేర్చేనయ్యా..

నా తీరం చేరే దారి మాకింకా చూపవయ్యా…

శరణని మొక్కిన చాలు.. పరుగున రావేమయ్యా…

బతుకంతా తోడుగా నిలిచి వెతలన్నీ బాపమయ్యా..

ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..

ఎర్రాటెండాకాలం మబ్బూల లేవయ్య… సల్లా గోదావరిలో తానాలు చేయవయ్యా…

ల ల ల ల … ల ల ల …ల ల ల… ల ల ల…

తానానే తానేనానే తననానే తానేనానే…

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Egillu Varanga Movie

  1. Shirisha Sri Rama Navami Song Lyrics

Shirisha Sri Rama Navami Song FAQ

What movie is Shirisha Sri Rama Navami song from?

Shirisha Sri Rama Navami song is from the & English - Egillu Varanga movie.