
| Movie Name | |
|---|---|
| Director | Shiva Turlapati |
| Star Cast | Anjali, Srinivas Reddy |
| Music | Pravin Lakkaraju |
| Singer(s) | Dinker Kalvala and Lipsika |
| Lyricist | Sreejo |
| Music Label | Mango Music |
యాక్షన్
వినరో..! సినిమా లైఫ్ అని, సినిమా లవ్ అని
సినిమాలే మా జగమండోయ్
భూతానికి బాక్సాఫీసుని
పరిచయమే చేద్దాం రారండోయ్
ఆస్కార్ బహుమతులెన్నున్నా
ఈ నటనకి సరితూగేనా
దిక్కుల శాపం, దయ్యపు కూపం
అంతే మా ప్రతాపం
శంభో శంభో శివ శంభో
నీదే భారం శివ శంభో
శంభో శంభో శివ శంభో
భోళా శంకర శివ శంభో ||2||
భూత పిశాచ మరీచ కురూప
మీ సూకపు ఘోషకి మా నమః
ప్రేత విసూచి కళీయ వికార
కఠోరపు కేకకి మా నమః
శాకినీ నమః, డాకినీ నమః
వికృత రూప నటనకు నమః
మోహినీ నమః, లంకిణీ నమః
వంకర అడుగుల నాట్యము నమః
షాట్‍కి నమః, టేక్‍కి నమః
సినిమా స్కోపుకి నమహో నమః
మొత్తం నమః, చిత్తం నమః
మహలుకి నమః
మొత్తానికే మీ దయ్యాలకో నమః
యాక్షన్, వినరో..!
సినిమా లైఫ్ అని, సినిమా లవ్ అని
సినిమాలే మా జగమండోయ్
భూతానికి బాక్సాఫీసుని
పరిచయమే చేద్దాం రారండోయ్
ఆస్కార్ బహుమతులెన్నున్నా
ఈ నటనకి సరితూగేనా
దిక్కుల శాపం, దయ్యపు కూపం
అంతే మా ప్రతాపం
శంభో శంభో శివ శంభో
నీదే భారం శివ శంభో
శంభో శంభో శివ శంభో
భోళా శంకర శివ శంభో ||2||
భూతేశా విను పొలికేక
కాపాడయ్యో కడదాకా
భువనేశా కను జనఘోష
మార్చేసెయ్ మా తలరాత
Shambhoo Shambhoo song is from the movie.
Shambhoo Shambhoo song was sung by Dinker Kalvala and Lipsika.
Shambhoo Shambhoo song lyrics were written by Sreejo.
Shambhoo Shambhoo song music was composed by Pravin Lakkaraju.