
| Movie Name | (1978) |
|---|---|
| Director | K Viswanath |
| Star Cast | Talluri Rameshwari, Chandra Mohan, Sridhar |
| Music | KV Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam, Susheela |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం
సీతాలు సింగారం… మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే… శ్రీలచ్చిమవతారం
మనసున్న మందారం… మనిషంతా బంగారం
బంగారు కొండయ్యంటే… భగవంతుడవతారం
మనసున్న మందారం… మనిషంతా బంగారం
బంగారు కొండయ్యంటే… భగవంతుడవతారం
సీతాలు సింగారం, ఊ ఊ
కూసంత నవ్విందంటే… పున్నమి కావాల
అయితే నవ్వనులే, ఏ ఏఏ
కాసంత చూసిందంటే… కడలే పొంగాల
ఇక చూడనులే, ఏ ఏఏ
కూసంత నవ్విందంటే పున్నమి కావాల
కాసంత చూసిందంటే కడలే పొంగాల
ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల
నువ్వంటుంటే నేవింటుంటే
నూరేళ్ళు నిండాలా, ఆ ఆఆ
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
మనసున్న మందారం, ఊ ఊ
లలల్లలాలా లాలా లాలలలాలలా
దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
అయితే నేనే వస్తాలే, ఏ ఏఏ
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను
ఎగిరొస్తాలే, ఏ ఏఏ
దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి వెలిగించాల
నీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై ఉండిపోవాలా
నువ్వంటుంటే నేవింటుంటే వెయ్యేళ్ళు బతకాలా, ఆ ఆ
సీతాలు సింగారం… మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే… భగవంతుడవతారం
లాలాలల లలలా లాలాలల లలలా
లాలాలల లలలా
Seethalu Singaram song is from the movie.
Seethalu Singaram song was sung by S P Balasubramanyam, Susheela.
Seethalu Singaram song lyrics were written by Veturi Sundararama Murthy.
Seethalu Singaram song music was composed by KV Mahadevan.