Seethalu Nuvvu Leka Song Lyrics - Donga Donga

Seethalu Nuvvu Leka Song Lyrics - Donga Donga
Seethalu Nuvvu Leka Song Lyrics: Seethalu Nuvvu Leka is a Telugu song from the film Donga Donga starring Prashanth, Anand, Heera Rajgopal, Anu Agarwal, directed by Mani Ratnam. "Seethalu Nuvvu Leka" song was composed by AR Rahman and sung by Shahul Hameed. Lyrics were written by Rajasri.

Seethalu Nuvvu Leka Song Details

Movie NameDonga Donga (1993)
DirectorMani Ratnam
Star CastPrashanth, Anand, Heera Rajgopal, Anu Agarwal
MusicAR Rahman
Singer(s)Shahul Hameed
LyricistRajasri
Music Label

Seethalu Nuvvu Leka Song Lyrics in Telugu

సీతాలు నువ్వు లేక నేను లేనే

ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే

ఎళ్ళిపోతే సేరుకుంటా మట్టిలోనే

ఆ కబురు సేరే లోగా సేరు నన్నే

సీతాలు నువ్వు లేక… నేను లేనే

సందె పొద్దు ముద్దరాలు… జాజిపూలు కోయు వేళా

పూలు కోయలేని మనసే కోసేనంటా

పెళ్ళి చీరా పసుపు నిట్ట పిండారేయు వేళ

మనసు పడిన వాడి మనసే పిండెనంటా

గడ్డి వాము సాటులోన… బాస చేసి కూడా, పోలేవే

పోయేవు పోయేవులే ప్రేమ తీసి గట్టు నెట్టి

నీ చీర సెంగులోనె కన్నీళ్ళు మూట గట్టి, పోలేవే

పోయేవు పోయేవులే కోరుకున్న తోడు వీడీ

ఇచ్చిన మల్లెలన్నీ నట్టేట ఇసిరేసి

నన్ను కన్నీటి వాగులోన అల చేసి

ఆడి తప్పుతారు… ఆడవాళ్ళు అన్నమాట

మాటలు కావవి… నీటి పైన రాతలంట

ఆడి తప్పుతారు… ఆడవాళ్ళు అన్నమాట

మాటలు కావవి… నీటి పైన రాతలంట

సీతాలు నువ్వు లేక నేను లేనే

ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే

ఎళ్ళిపోతే సేరుకుంటా మట్టిలోనే

ఆ కబురు సేరే లోగా సేరు నన్నే

సీతాలు నువ్వు లేక నేను లేనే

ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓ

ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ

బొట్టునీకు పెట్టిన… వేలి రంగు ఆరలేదే

పూసుకున్న చందనాల… వాసనింకా తగ్గలేదే

గాజువాకలోన కొన్న… గాజులింక వెయ్యలేదే

పెళ్ళి పంచె కట్టుకున్న… పసుపు వన్నె మాయలేదే

కళ్యాణ బుగ్గ చుక్క… కళ్ళారా చూసేది ఎప్పుడమ్మా

మల్లెల పక్కమీద… బంతులాట ఎప్పుడమ్మా

నీ కంటి కొనచూపు… కొసరి రువ్వేది ఎప్పుడమ్మా

సీకటి ఎలుగులోన సిందులాట ఎప్పుడమ్మ

ఎలమావి తోటలోనా… ఏకాకి గోరువంకా

శృతి మారి కూసేనమ్మ… జతకోసం వేచేనమ్మ

ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట

మాటలు కావవి నీటి పైన రాతలంట

ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట

మాటలు కావవి నీటి పైన రాతలంట

సీతాలు నువ్వు లేక నేను లేనే

ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే

ఎళ్ళిపోతే సేరుకుంటా మట్టిలోనే

ఆ కబురు సేరే లోగా సేరు నన్నే

సీతాలు నువ్వు లేక నేను లేనే

ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Donga Donga Movie

  1. Kanulu Kanulanu Dochayante Song Lyrics
  2. Seethalu Nuvvu Leka Song Lyrics
  3. Koncham Neeru Koncham Nippu Song Lyrics

Seethalu Nuvvu Leka Song FAQ

What movie is Seethalu Nuvvu Leka song from?

Seethalu Nuvvu Leka song is from the Donga Donga movie.

Who sang Seethalu Nuvvu Leka song?

Seethalu Nuvvu Leka song was sung by Shahul Hameed.

Who wrote Seethalu Nuvvu Leka song lyrics?

Seethalu Nuvvu Leka song lyrics were written by Rajasri.

Who composed music for Seethalu Nuvvu Leka song?

Seethalu Nuvvu Leka song music was composed by AR Rahman.