| Movie Name | Indrudu Chandrudu Cinema |
|---|---|
| Director | Suresh Krissna |
| Star Cast | Kamal Haasan, Vijayashanti |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
సంధ్యా రాగపు సరిగమలో… తొలి కలయికలో
సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో
దోరేమి రాగాల జోరేమి
దాసాదా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో… తొలి కలయికలో
సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో
చినుకు చినుకు నడుములో
చిలకలులికి పడెనులే, హోయ్
కనుల కనుల నడుమలో
కలల సుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో
వలపు మధువు తొణికెలే
తనువు తనువు కుదుపులో
తమకమొకటి మెరిసెలే
సంధ్యలో తారలాగ స్వప్నమై పోకుమా
కన్నెలో సోయగాలు… కంటితోనే తాగుమా
హంసలా హాయిగా… ఆమని రేయిలా వాలిపో ప్రియా
ఓ ఓ, సంధ్యా రాగపు సరిగమలో… తొలి కలయికలో
సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో
దోరేమి రాగాల జోరేమి
దాసాదా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో
ఎదుటపడిన బిడియమే
చెమట నుదుట చిలికెలే
ఒణుకు తొణుకు పరువమే
వడికి వయసు కలిపెలే
వలపు పొడుపు కధలలో
చిలిపి ముడులు విడెనులే, హోయ్
మరుల విరుల పొదలలో
మరుడి పురుడు జరిగెలే
తేనెలే దోచుకెళ్ళే… తుమ్మెదై పోకుమా
గాలికే గంధమిచ్చే… కౌగిలింతే దూరమా
పాటల తోటలో… పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా
ఓ ఓ, సంధ్యా రాగపు సరిగమలో… తొలి కలయికలో
సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో
దోరేమి రాగాల జోరేమి
దాసాదా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో
Sandhya Ragapu Sarigamalo song is from the Indrudu Chandrudu Cinema movie.
Sandhya Ragapu Sarigamalo song was sung by S P Balasubramanyam, S Janaki.
Sandhya Ragapu Sarigamalo song lyrics were written by Veturi Sundararama Murthy.
Sandhya Ragapu Sarigamalo song music was composed by Ilayaraja.