
| Movie Name | Abhiram |
|---|---|
| Director | Ramakrishnarjun |
| Star Cast | Yashraj, Siva Balaji, Navami Gayak |
| Music | Meenakshi Bhujang |
| Singer(s) | Uma Neha, Simha |
| Lyricist | Sagar Narayana |
| Music Label | Tips Telugu |
చుట్టు చుట్టు పట్టు చీరను కట్టి
చుట్టకట్టి గుండె కొంగున చుట్టి
కట్టకట్టి నిన్ను బుట్టలో పెట్టె
అగ్గి పెట్టే, అగ్గే పెట్టే
అట్ట ఇట్ట చూసి కన్నే కొట్టి
చిట్టి గుండె చుట్టు దారం చుట్టి
పట్టు పట్టి ప్రేమ ముగ్గులో నెట్టే
పిల్లగాడా, అల్లారోడా
హే, సైదులో సైదుల
ఆ నంగనాచి పిల్లే
ఓ, సైదులో సైదుల
నా గుండె గుంజుకెల్లే
సైదులో సైదుల
ఈ నాటు పోరాగాల్లే
ఓ సైదులో సైదుల
నట్టేట ముంచేటోల్లే
చుట్టు చుట్టు పట్టు చీరను కట్టి
చుట్టకట్టి గుండె కొంగున చుట్టి
కట్టకట్టి నిన్ను బుట్టలో పెట్టె
అగ్గి పెట్టే, అగ్గే పెట్టే
బీరు బాటిల్ లాంటి బుట్టబొమ్మలు మీరు
ఒక్కో నరమెక్కేసి చుక్కలు చూపిస్తారు
ఓసారి మీపైన మనసంటూ పడ్డామా
ఆ పైనా ఏమైనా వదిలేసి పోతామా
రేసుగుర్రాల్లాంటి కుర్రాళ్ళు మీరంతా
వీసా ఇవ్వకముందే దూరేసి మనసంతా
ఆగం ఆగం జేసి అంతల వదిలేస్తారు
ప్రాణం ప్రాణం అంటూ పైపైనే అంటారు
సైదులో సైదుల
ఈ నాటు పోరాగాల్లు
ఓ, సైదులో సైదుల
కాటేసే కీచురాళ్ళు
అరె, సైదులో సైదుల
ఈ నంగనాచి పిల్లే
ఓ, సైదులో సైదుల
నాటింది నవ్వు ముల్లే
చుట్టు చుట్టు పట్టు చీరను కట్టి
చుట్టకట్టి గుండె కొంగున చుట్టి
కట్టకట్టి నిన్ను బుట్టలో పెట్టె
అగ్గి పెట్టే, అగ్గే పెట్టే
ఆచి తూచి అడుగే వెయ్యాలి అబ్బాయి
ఆడపిల్లలు మీలా బయట పడలేరోయి
నీతో రాసే ఉంటే కాదన్నా ఆగేనా
ఎదారోజు అంటూ నా మనసే కోరేనా
ఏరోజో ఆరోజు జరిగేదే అమ్మాయి
ఆరోజు కాదన్నా మోగేనే సన్నాయి
పాలు నీళ్లు కలిసి మిక్సైన తీరల్లే
నువ్వు నేను కలిసి పండిచాలే ప్రేమ
సైదులో సైదుల
మోగాలి పెళ్ళి డోలు
ఓ, సైదులో సైదుల
చెయ్యాలి సంబరాలు
సైదులో సైదుల
చూడాలి కోటి కళ్ళు
ఓ, సైదులో సైదుల
వెయ్యాలి మూడు ముళ్ళు
Saidulo Saidhula song is from the Abhiram movie.
Saidulo Saidhula song was sung by Uma Neha, Simha.
Saidulo Saidhula song lyrics were written by Sagar Narayana.
Saidulo Saidhula song music was composed by Meenakshi Bhujang.