| Movie Name | & English - Khaleja |
|---|---|
| Director | Trivikram Srinivas |
| Star Cast | Mahesh Babu, Anushka Shetty |
| Music | Mani Sharma |
| Singer(s) | Ramesh Vinayakam & Karunya |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | SonyMusicSouthVEVO |
ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయా, ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిఠలాక్ష్యాయ
ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమశైలావరణాయ, ప్రమధాయ
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ
సదా శివా సన్యాసి… తాపసి కైలాసవాసి
నీ పాదముద్రలు మోసి… పొంగి పోయినాదె పల్లె కాశి
ఏయ్ సూపుల సుక్కాని దారిగా… సుక్కల తివాసీ మీదిగా
సూడ సక్కని సామి దిగినాడురా… ఏసైరా ఊరు వాడా దండోరా
ఏ, రంగుల హంగుల పొడ లేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నిలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం, శాపం తీర్చేవాడేరా..!
పైపైకలా బైరాగిలా… ఉంటాదిరా ఆ లీల..!
లోకాలనేలేటోడు… నీకు సాయం కాకపోడూ
ఏయ్, నీలోనె కొలువున్నోడు
నిన్ను దాటి పోనే పోడు
ఓం నమఃశివ జై జై జై… ఓం నమఃశివ జై జై జై
ఓం నమఃశివ… గ్రూవ్ టు ద ట్రాన్స్ అండ్ సే, జై జై జై
సింగ్ ఎలాంగ్ అండ్ సింగ్… శివ శంభో ఆల్ ద వే
ఓం నమఃశివ జై జై జై… హీల్ ద వరల్డ్ ఈజ్ ఆల్ వి ప్రే
సేవ్ అవర్ లైవ్స్ అండ్ టేక్ అవర్ పెయిన్ అవే, జై జై జై
సింగ్ ఎలాంగ్ అండ్ సింగ్… శివ శంభో ఆల్ ద వే
సదాశివా సన్యాసి… తాపసి కైలాసవాసి
నీ పాదముద్రలు మోసి… పొంగి పోయినాదె పల్లె కాశి
ఎక్కడ వీడుంటే నిండుగా… అక్కడ నేలంతా పండగ
చుట్టు పక్కల చీకటి పెల్లగించగా
అడుగేశాడంట కాచే దొరలాగా..!!
మంచును మంటను ఒక్కతీరుగా
లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యగా
ఉక్కుపెంచగా ఊపిరి నిలిపాడురా
మనకండా దండా ఇక వీడే నికరంగా
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా
లోకాలనేలేటోడు… నీకు సాయం కాకపోడూ
ఏయ్, నీలోనె కొలువున్నాడు
నిన్ను దాటి పోనే పోడు
ఓం నమఃశివ జై జై జై… ఓం నమఃశివ జై జై జై
ఓం నమఃశివ… గ్రూవ్ టు ద ట్రాన్స్ అండ్ సే, జై జై జై
సింగ్ ఎలాంగ్ అండ్ సింగ్… శివ శంభో ఆల్ ద వే
ఓం నమఃశివ జై జై జై… హీల్ ద వరల్డ్ ఈజ్ ఆల్ వి ప్రే
సేవ్ అవర్ లైవ్స్ అండ్ టేక్ అవర్ పెయిన్ అవే, జై జై జై
సింగ్ ఎలాంగ్ అండ్ సింగ్… శివ శంభో ఆల్ ద వే
Sada Shiva Sanyasi song is from the & English - Khaleja movie.
Sada Shiva Sanyasi song was sung by Ramesh Vinayakam & Karunya.
Sada Shiva Sanyasi song lyrics were written by Ramajogayya Sastry.
Sada Shiva Sanyasi song music was composed by Mani Sharma.