
| Movie Name | () |
|---|---|
| Director | Vivek Athreya |
| Star Cast | Nani, Priyanka Arul Mohan |
| Music | Jakes Bejoy |
| Singer(s) | Karthik |
| Lyricist | Sanare |
| Music Label |
నగవే లేని పెదవుల్లోన
ఒక నీ పేరే మెదిలెనే
తగువే లేని మగతల్లోన
మనసే నిన్ను తలచెనే
అనుకుందే జరిగిందా
దారేదో దొరికిందా
వద్దందే వచ్చిందేమో
చిత్రంగా కాదనగలమా
(స రి మ ప మా… స రి మ ప మా)
చిరుగాలి వీచినా… వెతికేను చూపులే
తను ముందు నిలిచినా… సోదాలు ఆపవే
కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె
తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే
అరరె అరరె కలలానే ఉన్నా, (ఉహు ఊహు ఊ)
కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో
నీతో నేనుంటే, ఏ ఏ ఏ…
స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
అనుకుందే జరిగిందా
దారేదో దొరికిందా…
వద్దందే వచ్చిందేమో
చిత్రంగా కాదనగలమా…?
జరగని కలకన్నారు
తెగ వెతుకుతు ఉన్నారు
తెలియక చేరారు… మీరో తీరమే
కాలం కలిసొచ్చే… బంధం దొరికిందే
నీలా తిరిగిందే… నీ ముందే
తడి మేఘంలా సూర్యున్ని దాచావు నువ్వే
ఆ తాపాలే ఆపేసే… నీ చిన్ని నవ్వే
చూపే కొంచెం సోకితేనే… మంచే ముంచెనే
రాసే లెక్కే దారే తప్పే రాతే నీతో మార్చి రాసావే
చలాకి వీరుడులే
చెలి చెంతింక చేరెనులే
చిన్నారి ఈ చిలకే
చెంగు చెంగంటూ చెయ్ కలిపే
(గ ప గ పా గ ప గ పా, ఆ ఆ ఆ
గ ప గ పా గ ప గ పా)…
కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె
తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే
అరరె అరరె కలలానే ఉన్నా, (ఉహు ఊహు ఊ)
కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో
నీతో నేనుంటే, ఏ ఏ ఏ…
స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
అనుకుందే జరిగిందా
దారేదో దొరికిందా…
వద్దందే వచ్చిందేమో
చిత్రంగా కాదనగలమా…?
స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Sa Ri Ma Pa song is from the movie.
Sa Ri Ma Pa song was sung by Karthik.
Sa Ri Ma Pa song lyrics were written by Sanare.
Sa Ri Ma Pa song music was composed by Jakes Bejoy.