
| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | Chaitanya Prasad |
| Music Label |
ఎందుకిలా ఏమిటిలా.. ప్రపంచమంతా విలవిలా…
పొరపాటుకు పెను మూల్యం చెల్లించక తప్పదిలా… తప్పదిలా
ఎందుకిలా ఏమిటిలా..
కాలుష్యం కోరలు సాచి… ప్రకృతినే కబళించిందా…
స్వార్థమనే జబ్బే బలిసి… మన బుద్దిని చంపేసిందా…
మత మౌఢ్యం విర్రవీగుతూ… దేవుడినే శాసిస్తోందా..
కోట్ల జీవరాసుల ఈ భూమినీ.. కోట్ల జీవరాసుల ఈ భూమినీ..
మనుష జాతి మింగేస్తుందా… మింగేస్తుందా..
ఎందుకిలా ఏమిటిలా….
అవసరాల కోసమవనిని.. అంగడిగా మార్చేశావా…
ప్రాణాలను వస్తువు చేసి వ్యాపారం సాగించావా..
సహజీవన సూత్రం కూడా ఇంత ఏకాకిని చేశావా..
ప్రగతి పేర ఈ సమస్త జగతినీ ఆదో గతికి…
దిగజార్చావా… దిగజార్చావా… ఎందుకిలా ఏమిటిలా..
స్వచ్చమైన గాలే లేదా… స్వచ్చమైన నీరే లేదా..
స్వచ్ఛమైన తిండే లేదా.. స్వచ్ఛమైన మనసే లేదా…
నిన్న లేదు… నేడూ ఉండదు….
రేపైనా మిగిలుంటుందా… మిగిలుంటుందా… ఎందుకిలా ఏమిటిలా…
తప్పు దిద్దుకుంటే మనిషి… కాలం తను కాదంటుందా…
కాలం తను కాదంటుందా…
చేద్దాం ఇక మనమే యుద్ధం.. మన లోపలా బయటా యుద్ధం.
మన బుద్ధిని శుద్ధిని చేసే నిబద్దతో నిత్యం యుద్ధం…
అనివార్యం అంతిమ యుద్ధం.. అవుదాం ఇక అంతా సిద్ధం…
అనివార్యం అంతిమ యుద్ధం.. అవుదాం ఇక అంతా సిద్ధం…
యుద్ధం ఇది మన యుద్ధం… అవుదాం సిద్ధం…
యుద్ధం అంతిమ యుద్ధం.. అవుదాం సిద్ధం
RP Patnaik Endukila Emitilaa Corona Virus song is from the movie.
RP Patnaik Endukila Emitilaa Corona Virus song lyrics were written by Chaitanya Prasad.