
| Movie Name | By Haricharan, Rx 100 |
|---|---|
| Director | Ajay Bhupathi |
| Star Cast | Karthikeya, Payal Rajput |
| Music | Chaitan Bharadwaj |
| Singer(s) | Haricharan |
| Lyricist | Chaitanya Prasad |
| Music Label | Saregama Telugu |
రెప్పలనిండా కలగనకుండా
వెన్నెలవాన అనుకోకుండా
పెదవులనిండా మాటలవలన
అలలు ఎగసెనులే
ఈ మట్టిలోన పూసే రోజాపూలే
రాగాలు కురిసే వెదురులే
ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా
నాలో లేవీ మహిమలే
కొడవలినిండా… కుంకుమ పూలే
కడవలనిండా మందారాలే
పడవలనిండా పట్టు తెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
పట్టు గుబురు దాటే సీతాకోక చిలుకలా
మిట్ట కలలు దాటే అందమైన నిజములా
పట్టి లాగేనే… పట్టుతీగా నన్నిలా
ఏమయ్యిందో నాకేమయ్యిందో
వద్దంటున్నా నీ ముద్దే నన్ను
రమ్మంటుందే నను చంపేసిందే
రయ్ రయ్ రంగులువెయ్
ఎన్నడు చూడనిదై
గుండెలో బొమ్మల్లే పూసే
కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండా మందారాలే
పడవలనిండా పట్టు తెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
చంటిపాపలాగా చిందులేవో వేస్తున్నా
ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్న
వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా
ఏమయ్యిందో నాకేమయ్యిందో
రోజు చూసే… నా దారులు కూడా
నేనే ఎవరో… మరి మరిచేసాయే
ఎన్నో ఎన్నెన్నో… వింతలు నాలోన
ఎన్నడూ ఊహించనివేగా
కొడవలినిండా… కుంకుమ పూలే
కడవలనిండా మందారాలే
పడవలనిండా పట్టు తెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
Reppalaninda song is from the By Haricharan, Rx 100 movie.
Reppalaninda song was sung by Haricharan.
Reppalaninda song lyrics were written by Chaitanya Prasad.
Reppalaninda song music was composed by Chaitan Bharadwaj.