
| Movie Name | LOVE Birds |
|---|---|
| Director | P. Vasu |
| Star Cast | Prabhu Deva, Nagma |
| Music | AR Rahman |
| Singer(s) | Unni Krishnan & Sujatha |
| Lyricist | Sirivennela Sitarama Sastry |
| Music Label | Aditya Music |
రేపే లోకం ముగిసేనంటే
చెలియా ఏం చేస్తావు
రేపే లోకం ముగిసేనంటే
చెలియా ఏం చేస్తావు
కన్నులు తెరిచి… కాలం మరిచి
నింగినే కన్నుల నింపుకొని
ముందుకు ఒరిగీ ఆఖరిసారిగా
ప్రేమగా భువికే ముద్దులిచ్చీ
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ
ఆ దేవుడినే వేడుకుంటాలే
రేపే లోకం ముగిసేనంటే
చెలియా ఏం చేస్తావు..?
రేపే లోకం, రేపేలోకం ముగిసేనంటే నువ్వేం చేస్తావూ
ఒక నూరేళ్ళ జీవితమంతా… ఈనాడే జీవిస్తా
నీ పెదవులపైన పెదవులు చేర్చి… కన్నులే మూసుకుంటా
మరణం వరకూ మమతలు పంచి… మరణాన్నే మరిపిస్తాలే
రేపే లోకం ముగిసేనంటే
చెలియా ఏం చేస్తావు
రేపే లోకం ముగిసే నంటే
చెలియా ఏం చేస్తావు
కన్నులు తెరిచి… కాలం మరిచి
నింగినే కన్నుల నింపుకొని
ముందుకు ఒరిగీ ఆఖరి సారిగా
ప్రేమగా భువికే ముద్దులిచ్చీ
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ
ఆ దేవుడిని వేడుకుంటాలే
వలపు అనేది నిలిచెవరకూ
భూలోకం ముగియదులే
కోటి మెరుపులు కోసేస్తున్నా
ఆ గగనం చీలదులే
ప్రణయాలెన్నో రానీపోనీ
జీవనయానం సాగునులే
తనువేమైనా మనమేమైనా
అనురాగం ఆగదులే
రేపే లోకం ముగిసేనంటే
ప్రియా ఏం చేస్తావు
రేపే లోకం ముగిసేనంటే
ప్రియా ఏం చేస్తావు
నింగికి నేలకి వందనమంటూ
నిను నా ఒడిలో చేర్చుకుంటా
వన్నెల విరుల పానుపు వేసి
నాలో నిన్నే నిలుపుకుంటా
నాలో ఊపిరి ఉన్నంత వరకూ
నీ కావలినై నిలిచి ఉంటాలే
రేపే లోకం ముగిసేనంటే
చెలియా ఏం చేస్తావు
Repe Lokam song is from the LOVE Birds movie.
Repe Lokam song was sung by Unni Krishnan & Sujatha.
Repe Lokam song lyrics were written by Sirivennela Sitarama Sastry.
Repe Lokam song music was composed by AR Rahman.