| Movie Name | |
|---|---|
| Director | Kovelamudi Raghavendra Rao |
| Star Cast | Mohan Babu, Meena, Ramya Krishna |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam & Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
(తననా)ఆ ఆ ఆఆ (తననా)ఆ ఆ ఆఆ
(తననా)ఆ ఆ ఆఆ (తననా)ఆ ఆ ఆఆ
(తననా) (తననా)
రేపల్లె మళ్ళీ మురళి విన్నది, (తననా)
మా పల్లె కలే పలుకుతున్నది, (తననా)
ఆ జానపదం జల్లుమన్నది, (తననా)
ఆ జాన జతై అల్లుకున్నదీ
మొగలి పువ్వు మారాజుకి… మొదటి కానుకా
ఎదను పరిచి వేసెయ్యనా… ప్రణయ వేదికా
మల్లె నవ్వు మారాని… ఈ గొల్ల గోపికా
మూగ మనసు వింటున్నది మురళి గీతికా
(తననా), రేపల్లె మళ్ళీ మురళి విన్నది
(తననా), మా పల్లె కలే పలుకుతున్నది
(తానన తందానన తజుం తజుం జుం)
తానన తందానన తజుం తజుం, తజుం తజుం
ఆ పెంకితనాల… పచ్చిగాలి ఇదేనా
పొద్దుపోని ఆ ఈలలేనా… ఈ ఆలాపన
ఆ కరుకు తనాల… కన్నె మబ్బు ఇదేనా
ఇంతలోనే చిన్నారి చినుకై… చెలిమే చిలికెనా
అల్లరులన్ని పిల్లనగ్రోవికి… స్వరములిచ్చేనా
కళ్ళెర్రజేసే కిన్నెరసానికి… సరళి నచ్చేనా
మెత్తదనం, (తందానన) మెచ్చుకొని
గోపాల క్రిష్ణయ్య గారాలు చెల్లించనా
(తననా), రేపల్లె మళ్ళీ మురళి విన్నది
(తననా), మా పల్లె కలే పలుకుతున్నది
మొగలి పువ్వు మారాజుకి… మొదటి కానుక
మూగమనసు వింటున్నది… మురళి గీతికా
(ససని సరి సరి సరి పనిని సగ పని నిని నిని నిని)
నీ గుండె వినేలా… వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను… ఈ గాలితో
ఆ ఆ ప్రేమపదాల గాలిపాట స్వరాల
పోల్చుకొని కలిపేసుకున్నాను నా శ్వాసలో
ఎక్కడ ఉన్నా ఇక్కడ తిన్న వెన్నె వేణువయ్యే
కొంగును లాగి కొంటెదనాలే… కంటికి వెలుగయే
వన్నెలలో, (తందానన) వెన్నెలలే
వెచ్చని వెల్లువలయ్యే వరసిదీ
రేపల్లె మళ్ళీ మురళి విన్నది
మా పల్లె కలే పలుకుతున్నది
ఆ జానపదం ఝల్లుమన్నది
ఆ జానజతై అల్లుకున్నదీ
మొగలి పువ్వు మారాజుకి మొదటి కానుకా
ఎదను పరిచివేసెయ్యనా ప్రణయ వేదికా
మల్లె నవ్వు మారాని… ఈ గొల్ల గోపికా
మూగమనసు వింటున్నది మురళి గీతికా
లాలాల ల్లలా లాల లాల లా
లాలాల లలా లాల లాల లా
Repalle Malli Murali Vinnadi song is from the movie.
Repalle Malli Murali Vinnadi song was sung by S P Balasubramanyam & Chitra.
Repalle Malli Murali Vinnadi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Repalle Malli Murali Vinnadi song music was composed by M M Keeravani.