
| Movie Name | Chuttalunnaru Jagratha Songs |
|---|---|
| Director | BV Prasad |
| Star Cast | Krishna, Sridevi |
| Music | M.S.Viswanathan |
| Singer(s) | P Susheela, S P Balasubramanyam |
| Lyricist | C Narayana Reddy |
| Music Label |
రెక్కలు తొడిగి రెపరెపలాడి
రివ్వంటుంది కోరికా
దిక్కులు తోచక చుక్కల దారుల
చెలరేగింది వేడుకా
రెక్కలు తొడిగి రెప రెపలాడి
రివ్వంటుంది కోరికా
దిక్కులు తోచక చుక్కల దారుల
చెలరేగింది వేడుకా
వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది
వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది నిమిషమాగకా
మనసే వెంబడించిందీ నిమిషమాగకా
రెక్కలు తొడిగి రెప రెపలాడి
రివ్వంటుంది కోరికా
రివ్వంటుంది కోరికా, ఆఆ ఆ ఆ
చెంతగా చేరితే..!
చెంతగా చేరితే… వింతగా ఉన్నదా
మెత్తగా తాకితే… కొత్తగా ఉన్నదా
మెత్తగా తాకితే… కొత్తగా ఉన్నదా
నిన్న కలగా ఉన్నది
నేడు నిజమౌతున్నది
నిన్న కలగా ఉన్నది
నేడు నిజమౌతున్నది
అనుకున్నది అనుభవమైతే
అంతకన్న ఏమున్నది
ఆ, వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది నిమిషమాగకా
మనసే వెంబడించిందీ నిమిషమాగకా
రెక్కలు తొడిగి రెప రెపలాడి
రివ్వంటుంది కోరికా, ఆ
రివ్వంటుంది కోరికా, ఆ ఆఆ ఆ ఆ
హా ఆ ఆ
ఆఆ ఆ ఆ
హా ఆఆ ఆ ఆఆ
కళ్ళతో నవ్వకు
కళ్ళతో నవ్వకు ఝల్లుమంటున్నది
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది
తొలి చూపున దాచింది
మలి చూపున తెలిసింది
తొలి చూపున దాచింది
మలి చూపున తెలిసింది
ఆ చూపుల అల్లికలోనే
పెళ్ళిపిలుపు దాగున్నది
ఆ వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది నిమిషమాగకా
మనసే వెంబడించిందీ నిమిషమాగకా
రెక్కలు తొడిగి రెప రెపలాడి
రివ్వంటుంది కోరికా
దిక్కులు తోచక చుక్కల దారుల
చెలరేగింది వేడుకా
హా ఆ హా
ఆ ఆ హా
ఆ ఆ ఆ హా
ఆ ఆ ఆ హా
Rekkalu Todigi song is from the Chuttalunnaru Jagratha Songs movie.
Rekkalu Todigi song was sung by P Susheela, S P Balasubramanyam.
Rekkalu Todigi song lyrics were written by C Narayana Reddy.
Rekkalu Todigi song music was composed by M.S.Viswanathan.