
| Movie Name | & English - Allantha Doorana |
|---|---|
| Director | Chalapathi Puvvala |
| Star Cast | |
| Music | Radhan |
| Singer(s) | Naresh Iyer & K Sivaangi |
| Lyricist | Rambabu Gosala |
| Music Label | Mango Music |
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే
గువ్వల గుంపే మనమైపోదాం
చిందులు వేస్తూ అల్లరి చేసే
చిచ్చరపిడుగులు మనమైపోదాం
చూసేద్దాం చూసేద్దాం
కొత్త ప్రపంచం అంచును చూసేద్దాం
చూసేద్దాం చూసేద్దాం
రంగులకలల తీరం చూసేద్దాం
నింగీ నేల కలిసే చోటున
మనమే నిలబడుదాం
నలుదిక్కుల హద్దులు దాటి
మనమే పరిగెడదాం
హుషారున మార్గం ఎంచుకొని
కులాసా దీవికి చెక్కర్లే కొడదాం
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే
గువ్వల గుంపే మనమైపోదాం
చిందులు వేస్తూ అల్లరి చేసే
చిచ్చరపిడుగులు మనమైపోదాం
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే
గువ్వల గుంపే మనమైపోదాం
చిందులు వేస్తూ అల్లరి చేసే
చిచ్చరపిడుగులు మనమైపోదాం
ఆకాశానికి కాంపౌండ్ వాలంటే
కుదరని పని అంటాం
మనలో జోషుని బంధించాలంటే
ఎవరివళ్ళా కాదంటాం
చందమామకు కలరెయ్యాలంటే
అవ్వని పని అంటాం
మన స్పీడికి బ్రేకేయ్యాలంటే
సాధ్యమవ్వదే ఇక పిమ్మట
దొరికిన ఫ్రీడమ్ వరమంటూ
మస్తీ మంత్రం జపిద్దాం
ఇకపై రాకాన్ అనుకుంటూ
క్షణమొక లైఫ్ గా లాగిద్దాం
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే
గువ్వల గుంపే మనమైపోదాం
చిందులు వేస్తూ అల్లరి చేసే
చిచ్చరపిడుగులు మనమైపోదాం
చల్లగాలికి సిగ్నల్ లైటేస్తే
ఆగదు అది అంటాం
మా అల్లరికి కంట్రోల్ లేదంటూ
అరుపుల సౌండే పెంచేస్తాం
నల్ల మబ్బుకి ట్రాఫిక్ రూల్సుంటే
పకపక నవ్వేస్తాం
మా దారులకే టోల్ గేట్ లేదంటూ
దూసుకుపోతూ దున్నేస్తాం
గుండ్రని భూమిని బంతిగ చేసి
ఫుట్ బాలాడేద్దాం
ఎర్రని సూర్యుని స్విచ్ ఆఫ్ చేసి
మూన్ లైట్ రప్పిద్దాం
కేరింతల జోరే మాది అంటూనే
నేచర్ తోటి దోస్తీ చేసేద్దాం
కేరింతల జోరే మాది అంటూనే
నేచర్ తోటి దోస్తీ చేసేద్దాం
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే
గువ్వల గుంపే మనమైపోదాం
చిందులు వేస్తూ అల్లరి చేసే
చిచ్చరపిడుగులు మనమైపోదాం
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే
గువ్వల గుంపే మనమైపోదాం
చిందులు వేస్తూ అల్లరి చేసే
చిచ్చరపిడుగులు మనమైపోదాం
Rekkalu Thodigi song is from the & English - Allantha Doorana movie.
Rekkalu Thodigi song was sung by Naresh Iyer & K Sivaangi.
Rekkalu Thodigi song lyrics were written by Rambabu Gosala.
Rekkalu Thodigi song music was composed by Radhan.