Movie Name | Barabar Premistha (2025) |
---|---|
Director | Sampath Rudra |
Star Cast | Chandra Hass, Megna Mukharjee, Arjun Mahi (Ishtamgaa fame) Murali Goud, Madhunandhan, Meesala Laxman, Abainaveen, Rajashekar, Rajamouli, Keerthi Latha Goud, Suneetha Manohar |
Music | RR Druvan |
Singer(s) | Nakash Aziz, Sahiti Chaganti |
Lyricist | Suresh Gangula |
Music Label |
సిరిసిల్ల సీర కట్టి చిన్నదాన
నువ్వు సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా
సిరిసిల్ల సీర కట్టి చిన్నదాన
నువ్వు సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా
నీ జడనట్ట ఊపుతుంటే జాతరాలేనా…. ఆ
అరె అరె అరె ఏం పిల్లదాన్ని కన్నవ్ రెడీ మామ
నా వల్ల అసలైతలేదు రెడ్డి మామ
ఏం పిల్లదాన్ని కన్నవ్ రెడీ మామ
సిగ్గుపడుతూ అగ్గి పెట్టినాది రెడ్డి మామ
సింగరేణి బండిలాగా దూకెత్తాడు
వాడు ఉంగరాల జూటుతోని మస్తుంటాడు
సింగరేణి బండిలాగా దూకెత్తాడు
వాడు ఉంగరాల జూటుతోని మస్తుంటాడు
ఏడు అంగలేసేదాకా అగనంటునాడు..
ఏం పిల్లగాడ్ని కన్నవ్ రెడీ మామ
నా వల్ల అసలైతలేదు రెడ్డి మామ
ఏం పిల్లగాడ్ని కన్నవ్ రెడీ మామ
సందిస్తే సంకనేక్కుతాండు రెడ్డి మామ
దాని సూపుల్లో ఇప్పసారా
మాటల్లో పంచదార
ఊ అంటే ఓసారి తెచ్చేస్తా మల్లెమూర
ఏం పిల్లదాన్ని కన్నవ్
ఏ ఏ ఏం పిల్లదాన్ని కన్నవ్
ఏం పిల్లగాడ్ని కన్నవ్ రెడీ మామ
సందిస్తే సంకనేక్కుతాండు రెడ్డి మామ
కొత్త చీర కట్టి నేను సంతకు పోతాంటే
నెన్నోత్తనోయి ఆగమంటు ఆగం చేసాడే
అత్తరేదో కొట్టి నేను పట్నం పోతాంటే
నా పట్టగొలుసు సప్పుడిని అడ్డమొచ్చినాడే
కొకపేట ఫ్లాటులా కొక కట్టి నువ్వలా
నడుచుకుని పోతాంటే పాణమంత విల విల
సన్నగున్న బియ్యమల్లె చిట్టినడుమునే ఆలా
ఊపుతుంటే ఊపిరంత ఊయ్యలూగేనే ఎలా
ఏం పిల్లదాన్ని కన్నవ్ రెడీ మామ
నా వల్ల అసలైతలేదు రెడ్డి మామ
ఆ.. ఏం పిల్లగాడ్ని కన్నవ్ రెడీ మామ
నా వల్ల అసలైతలేదు రెడ్డి మామ
మామ రెడ్డి మామ
మామ రెడ్డి మామ
తలుసుకుంటే చాలు వాడు
చమట సుక్కలాగ పట్టి
రైకలోకి జారి ఉక్కపోత పెంచినాడే
పసుపు కొమ్ములాగా వాడు
మనసు కొమ్మపైన వాలి
వయసు బొమ్మతోటి ఆటలేవో కోరినాడే
ఒంటి గన్నమెత్తుకుని ఎంతకాలమే ఆలా
ఒంటి గానే తిరుగుతావు జంట కావే మరదలా
పంటి కింద నలిగిపోయే పంచదార గుళికలాగా
ఎంత తియ్యగున్నావే కొత్త పంట చేరుకులా
ఏం పిల్లదాన్ని కన్నవ్
మామ ఏం పిల్లదాన్ని కన్నవ్
ఏం పిల్లదాన్ని కన్నవ్ రెడీ మామ
నా వల్ల అసలైతలేదు రెడ్డి మామ
ఆడి సూపుల్లో కత్తిపీట మాటల్లో తేనేవూట
ఊ అంట ఈసారి తెచ్చేయ్ రా మల్లెముట
ఏం పిల్లగాడ్ని కన్నవ్…
ఏం పిల్లగాడ్ని కన్నవ్
ఏం పిల్లగాడ్ని కన్నవ్…
ఏం పిల్లగాడ్ని కన్నవ్ రెడీ మామ