
| Movie Name | Mangli () |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Madeen SK |
| Singer(s) | Mangli |
| Lyricist | Kamal Eslavath |
| Music Label |
రాణి రంగు సీర సుట్టి
అల్లిపూల మాల కట్టి
రేగుపళ్ళ సెట్టు కింద కుసోనుంటిరా
రాకుమార సెయ్యి పట్టి
గావురంగ సుట్టుముట్టి
పానమెత్తు సూసుకోను కాసుకుంటిరా
ఏగిల్లు వారుతుంటే
ఎన్నెల జారుతుంటే
కళ్ళే కళ్ళార్పకుండా నిన్నే నింపేసుకుంటే
రావేలా ఈ వేళా ఉయ్యాలలూగుదాము
కొండకోన కొమ్మలంచునా
సిలకల్లే గూడి పచ్చనాకు పూల చెంతనా
కొండ కోన కొమ్మలంచునా
సిలకల్లే గూడి పచ్చనాకు పూల చెంతనా
రాణి రంగు సీర సుట్టి
అల్లిపూల మాల కట్టి
రేగుపళ్ళ సెట్టు కింద కుసోనుంటిరా
రాకుమార సెయ్యి పట్టి
గావురంగ సుట్టుముట్టి
పానమెత్తు సూసుకోను కాసుకుంటిరా
నల్లాని కోయిలమ్మా… తెల్లాని పావురమ్మా
రారమ్మనంటూ నిన్ను పిలిసి అలిసెరా
రాగాల రావి కొమ్మా… ఏలాడు ఊడలమ్మ
నీ అడుగు అలికిడింటే నీడ కరుసురా
కోల కళ్ళ కోమలాంగినీ తేనె తీరు
వలపులున్న సుందరాంగినీ
ఊసులెన్నో మోసుకొస్తినీ
లేత పూల తేరునయ్యి చేరుకుంటినీ
పారేటి వాగువంక
పాడే గువ్వా గోరింకా
నిన్నంటు చూసినంకా
మనసాయే కృష్ణ జింకా
పువ్వల్లె మువ్వల్లే
ఇవ్వాలె సుట్టుకోరా
సోకు సిగ్గు మొగ్గలేసెనా
నీ సూపు తాకి పడుసు
పాల బుగ్గలంచునా
సోకు సిగ్గు ఒగ్గలేసనా
నీ చూపు తాకి పడుసు
పాల బుగ్గలంచునా
రాణి రంగు సీర సుట్టి
అల్లిపూల మాల కట్టి
రేగుపళ్ళ సెట్టు కింద కుసోనుంటిరా
రాకుమార సెయ్యి పట్టి
గావురంగ సుట్టుముట్టి
పానమెత్తు సూసుకోను కాసుకుంటిరా
నోరారా పిలుచుకున్న
గుండెల్లో నిలుపుకున్న
ఊరేగే ఊహలో ఊరిస్తవేందిరా
ఓసారి అడుగుతున్న
వేసారి అలుగుతున్న
ఈసారి అయినా వచ్చి పోతే ఏందిరా
ఓరకంట సూత్తవెందుకో
దోర దోర చూపులల్లే నన్ను దోసుకో
కొంటెమాటలప్పజెప్పుకో ఏరి కోరి
సిన్నదాని జంట చేరుకో
పరువాల పరుగులంతా
మురిపాల ముద్దులంతా
సిగ్గు సింగారమంతా పైలంగ పరుసుకుంటా
వచ్చేస్తే ఇచ్చేస్తా సావాసమోలే సాగి
వీలునామా వేల జన్మలా
అందాలరేడ అందివస్త బుట్టబొమ్మలా
వీలునామా వేల జన్మలా
అందాలరేడ అందివస్త బుట్టబొమ్మలా
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Rani song is from the Mangli movie.
Rani song was sung by Mangli.
Rani song lyrics were written by Kamal Eslavath.
Rani song music was composed by Madeen SK.