| Movie Name | Srimanthudu Rama Rama |
|---|---|
| Director | Koratala Siva |
| Star Cast | Mahesh Babu, Shruthi Hasan |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Sooraj Santhosh, Ranina Reddy & MLR Karthikeyan |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
హే సూర్యవంశ తేజమున్న
సుందరాంగుడు పున్నమీసెంద్రుడు
మారాజైనా మామూలోడు మనలాంటోడు
మచ్చలేని మనసున్నోడు
జనం కొరకు ధర్మం కొరకు
జనమమెత్తిన మహానుభావుడు… వాడే శ్రీరాముడు
హేయ్, రాములోడు వచ్చినాడురో… దన్ తస్సదియ్య
శివధనస్సు ఎత్తినాడురో
(దన్ తస్సదియ్య… శివధనస్సు ఎత్తినాడురో)
నారి పట్టి లాగినాడురో… దన్ తస్సదియ్య
నింగికెక్కు పెట్టినాడురో
(దన్ తస్సదియ్య… నింగికెక్కు పెట్టినాడురో)
ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు… ఆకసాలు కూలినట్టు
భళ భళ భళ భళ్లుమంటు… దిక్కులన్ని పేలినట్టు
విల విలమను విల్లువిరిచి… జనకరాజు అల్లుడాయెరో, ఓ ఓ ఓ
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా
(మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా)
(మరామ రామ రామ రామ రామ రామ రామ
మరామ రామ రామ రామ రామ రామ రామ)
ఓ, రాజ్యమంటె లెక్కలేదురో
దన్ తస్సదియ్య… అడవిబాట పట్టినాడురో
(దన్ తస్సదియ్య… అడవిబాట పట్టినాడురో)
పువ్వులాంటి సక్కనోడురో
దన్ తస్సదియ్య… సౌక్యమంత పక్కనెట్టెరో
(దన్ తస్సదియ్య… సౌక్యమంత పక్కనెట్టెరో)
బలె బలె బలె మంచిగున్న… బతుకునంత పణంపెట్టి
పలు మలుపులు గతుకులున్న… ముళ్ల రాళ్ల దారిపట్టి
తన కథనే పూసగుచ్చి… మనకు నీతి నేర్పినాడురో, ఓ ఓ ఓ
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా
(మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా)
హే రామసక్కనోడు మా రామసెంద్రుడంట
ఆడకళ్ల చూపు తాకి కందిపోతడంట
అందగాళ్లకే గొప్ప అందగాడట
నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా
హెయ్, జీవుడల్లే పుట్టినాడురో
దన్ తస్సదియ్య… దేవుడల్లె ఎదిగినాడురో
(దన్ తస్సదియ్య… దేవుడల్లె ఎదిగినాడురో)
నేలబారు నడిచినాడురో
దన్ తస్సదియ్య… పూల పూజలందినాడురో
(దన్ తస్సదియ్య… పూల పూజలందినాడురో)
హెయ్, పద పదమని వంతెనేసి… పెనుకడలిని దాటినాడు
పది పది తలలున్న వాణ్ని… పట్టి తాటదీసినాడు
చెడు తలుపుకి చావుదెబ్బ… తప్పదంటు చెప్పినాడురో, ఓ ఓ ఓ
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా
(మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా)
Ramulodu Vachinadu Ro song is from the Srimanthudu Rama Rama movie.
Ramulodu Vachinadu Ro song was sung by Sooraj Santhosh, Ranina Reddy & MLR Karthikeyan.
Ramulodu Vachinadu Ro song lyrics were written by Ramajogayya Sastry.
Ramulodu Vachinadu Ro song music was composed by Devi Sri Prasad.