
| Movie Name | Rajendrudu Gajendrudu (1993) |
|---|---|
| Director | S. V Krishna Reddy |
| Star Cast | Rajendra Prasad, Soundarya |
| Music | SV Krishna Reddy |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Anand Audio Telugu |
కుకుకూ కుకుకూ కుకుకూ
ఎవరో నీవని అనకు
కళ్ళతోని గుండె తట్టి చూడు
ప్రేమ నాడి కాస్త పట్టి చూడు
తొలి తొలి వలపుల
తలపులో మైమరపులో
కుకుకూ కుకుకూ కుకుకూ
నీవే నేనని తెలుసూ
కళ్ళతోనే గుండె తట్టి చూశా
ప్రేమ నాడి జాడ పట్టి చూశా
తొలి తొలి పరువపు
పిలుపులో మైమరపులో
కుకుకూ కుకుకూ కుకుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ
మనసున మెల్లగ ఊయలలూగిన
విరహపు మెరుపులు కన్నావా
తనువును తాకిన అల్లరి గాలుల
కమ్మని గుసగుస విన్నావా
కొంగుపట్టి లాగి కొత్తకొత్తగా
అబ్బాయి నన్ను చుట్టుకుంటే ఎంత మైకమో
అత్తిపత్తి లాగా మెత్త మెత్తగా
అమ్మాయి సిగ్గు దాచుకుంటే ఎంత అందమో
కుకుకూ కుకుకూ కుకుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ
నింగికి నేలకి… బాటలు వేసిన
తొలకరి చినుకుల ఆరాటం
విరిసిన పువ్వుల… పంచకు చేరిన
గడసరి తుమ్మెద కోలాటం
చిన్నదాని పాల బుగ్గ ఒంపులో
ఖిలాడి ముద్దు పెట్టుకుంటే ఎన్ని సొంపులో
హత్తుకున్న మేని వత్తి గింపులో
అల్లాడుతున్న పిల్లవాడికెన్ని చిక్కులో
కుకుకూ కుకుకూ కుకుకూ
ఎవరో నీవని అనకు
కళ్ళతోనే గుండె తట్టి చూడు
ప్రేమ నాడి కాస్త పట్టి చూడు
తొలితొలి వలపుల
తలపులో మైమరపులో
కుకుకూ కుకుకూ కుకుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ
Rajendrudu Gajendrudu Ku Ku Ku song is from the Rajendrudu Gajendrudu movie.
Rajendrudu Gajendrudu Ku Ku Ku song was sung by S P Balasubramanyam, Chitra.
Rajendrudu Gajendrudu Ku Ku Ku song lyrics were written by Bhuvana Chandra.
Rajendrudu Gajendrudu Ku Ku Ku song music was composed by SV Krishna Reddy.