
| Movie Name | Bhala Thandhanana |
|---|---|
| Director | Chaitanya Dantuluri |
| Star Cast | Sree Vishnu, Catherine Tresa |
| Music | Mani Sharma |
| Singer(s) | Anurag Kulkarni, Ramya Behra |
| Lyricist | Shree Mani |
| Music Label |
రాసానిలా కనబడనీ వినబడనీ ప్రేమలేఖ
చూసానిలా కదలననీ వదలననీ మౌనరేఖ
రాసానిలా కనబడనీ
వినబడనీ ప్రేమలేఖ
నింగిలోని నీరులా
నీటిపైన పేరులా
కానరాని ప్రేమలేఖా రాసానిలా
మీటలేని వీణలా
మాటరాని పాపలా
అందమైన మౌనరేఖ చూసానిలా
పుస్తకంలో దాచుకున్న
నెమలికన్ను జ్ఞాపకంలా
మనసు దాటలేని
మొదటి కవితలా
అల్లుకున్న పంజరానే
తేలుతున్న పావురంలా
గీసుకున్న గీతే దాటలేనెలా
తనని నాతో కలపగలిగే
పిలుపు ఏదో తెలియక
తెలుపలేక నిలుపలేక
అలసిపోయా…నికా
దాచానిలా నిజమిదనీ
ఋజువుదనీ చూపలేకా
చేరానిలా ఇరువురిదీ
ఒకటి అనీ తీరారేఖ
నడి ఎడారిదారిలో మౌన బాటసారిలా
ఒంటరల్లే సాగానే నాకు నేనే
ఎండమావి గుండెలో మండుతున్న ఎండనే
వెన్నెలల్లే కాచావే నీవు నన్నే
కలిసి ఉన్న వేళలోన
వీలుకాని మాటలన్నీ
మనసుతోటి నేడే మాటలాడనా
ఊపిరాగి ఆగమన్నా గుండెచప్పుడాపుతున్నా
దాచుకున్న ప్రేమే నీకు చూపనా
తెగిన గాయం తగదు అన్నా
ఆగిపోదే మన కధా
చివరి క్షణమే మధురకావ్యం
ప్రేమకెపుడూ కదా
Raasaanilaa song is from the Bhala Thandhanana movie.
Raasaanilaa song was sung by Anurag Kulkarni, Ramya Behra.
Raasaanilaa song lyrics were written by Shree Mani.
Raasaanilaa song music was composed by Mani Sharma.