
| Movie Name | Mr. King ( ) |
|---|---|
| Director | Sasiidhar Chavali |
| Star Cast | Sharan Kumar, Yashvika Nishkala, Urvi Singh |
| Music | Mani Sharma |
| Singer(s) | Mohana Bhogaraju, Dhanunjay |
| Lyricist | Kadali |
| Music Label |
రారా రారా రారా మేనాల్లా రా మావ
తే తే తే తే తే తే పుస్తెలు గొలుసులు
తేతే తేతే తేతే మల్లెలు మరువాలు
రారా రారా రారా జల్దీ రా, నా మావ
ఎక్కడికో నువ్ పారిపోయినా
ఇక్కడికే నే నిన్ను లాగనా
పూలవాన ఈ సోట సూడలేవా
రారా రారా రారా మేనాల్లా రా మావ
తే తే తే తే తే తే
ఎండమావి లా సూత్తవా
అంది అందకుండ ఉంటవా
ముచ్చటంత నువ్ వింటవా
ముట్టబోతే దూరం పోతవా
పొద్దుపొడుపల్లె తాకుతావు రవికిరణంలా
పొద్దుగూకగానే చేరతావు కల వెనకాల
(మాయ మాయగా)
అరె పట్టు పట్టి రానన్నా
నను లాగే టెన్ టు ఫైవ్ తెగువా
మరి అందకుండ నేనుంటే
తగువేనా, ఆ ఆఆ
నన్ను కోరినదాన
పొగరుంటే అందమే హొయ్నా
ఏది ఏది ఏమైనా
గిరి దాటి చూడవే జానా
రారా రారా రారా మేనాల్లా రా మావ
తే తే తే తే తే తే పుస్తెలు గొలుసులు
తేతే తేతే తేతే మల్లెలు మరువాలు
రారా రారా రారా జల్దీ రా, నా మావ
తామసల్లె నే పూజ సేయనా
ఈశ్వరుణ్నే నీ లోన సూడనా
నల్లపూసై నా నిన్ను కుట్టుకోనా
సుర్రుమన్న ఎండలో నీరు సెగలా
సర్రున తుర్రున ఉరికే
వెచ్చగున్న రేయి నా ఈడు ఇసకై
ఉడుకు పొగలు ఒలికే
నీరులాగ రావా క్షణమైనా
నిన్ను ఒంటెకోడై దాసుకోనా
సిన్న నవ్వులాగా ఉండలేవా
సీకరేణి ముళ్ళై గుచ్చుకోక
అరె నన్ను కోరినదాన
కలలుంటే చాలవే హొయ్నా
ఎంత ఆటుపోటైనా
జడవాలి నీకు పులి కూన
రారా రారా రారా మేనాల్లా రా మావ
తే తే తే తే తే తే పుస్తెలు గొలుసులు
తేతే తేతే తేతే మల్లెలు మరువాలు
రారా రారా రారా జల్దీ రా, నా మావ
పాటలోని కొన్ని పదాల అర్థాలు
మేనాల్లా = పల్లకిలో (మేన – పల్లకి)
సీకరేణి = ఒక రకమైన చెట్టు
Raa Raa Naa Mama song is from the Mr. King ( ) movie.
Raa Raa Naa Mama song was sung by Mohana Bhogaraju, Dhanunjay.
Raa Raa Naa Mama song lyrics were written by Kadali.
Raa Raa Naa Mama song music was composed by Mani Sharma.