
| Movie Name | Siri Siri Muvva (1976) |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Chandra Mohan, Jaya Prada |
| Music | KV Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
కలడందురు దీనుల ఎడా
కలడందురు పరమయోగి గణముల పాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడివాడు… కలడో లేడో
రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా
రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా
రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా
రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే
రామ హరే శ్రీరామ హరే
రామ హరే శ్రీరామ హరే
రామ హరే శ్రీరామ హరే
రాతిబొమ్మకు రవ్వలు పొదిగి
రామహరే శ్రీరామహరే
రాతిబొమ్మకు రవ్వలు పొదిగి
రామహరే శ్రీరామహరే
అని పట్టిన హారతి చూస్తూ
ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు
రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా
రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే
రామ హరే శ్రీరామ హరే
అలనాటి ఆ సీత… ఈనాటి దేవత
శతకోటి సీతల… కలబోత ఈ దేవత
రామచంద్రుడా కదలిరా… రామబాణమే వదలరా
ఈ ఘోరకలిని మాపరా… ఈ క్రూరబలిని ఆపరా
రా రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా
రా రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే
రామ హరే శ్రీరామ హరే
నటరాజా శతసహస్ర రవితేజా
నటగాయక వైతాళిక మునిజనభోజా
నటరాజా శతసహస్ర రవితేజా
నటగాయక వైతాళిక మునిజనభోజా
దీనావన భవ్యకళా… దివ్య పదాంభోజా
చెరిసగమై రసజగమై చెలగిన
నీ చెలి ప్రాణము బలిపశువై
యజ్ఞ్యవాటి వెలి బూడిద అయిన క్షణము
సతీవియోగము సహింపక
ధుర్మతియౌ దక్షుని మదమదంచగ
ఢమ ఢమ ఢమ ఢమ ఢమరుక ధ్వనుల
నమక చమక యమగమక లయంకర
సకలలోక జర్జరిత భయంకర
వికట నటస్పద విస్పులింగముల
విలయతాండవము సలిపిన నీవే
శిలవే అయితే పగిలిపో… శివుడే అయితే రగిలిపో
Ra Digi Ra Divi Ninchi song is from the Siri Siri Muvva movie.
Ra Digi Ra Divi Ninchi song was sung by S P Balasubramanyam.
Ra Digi Ra Divi Ninchi song lyrics were written by Veturi Sundararama Murthy.
Ra Digi Ra Divi Ninchi song music was composed by KV Mahadevan.